భూసేకరణ చేపడుతున్న అధికారులకు చుక్కెదురు.. ఆత్మహత్యలకు ప్రయత్నిస్తున్న రైతులు

Update: 2020-03-02 17:46 GMT

గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం అల్లంవారిపాలెంలో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నారు. ఉగాది నాటికి అందరికీ ఇళ్లు ఇవ్వాలని ప్రభుత్వం అధికారులపై ఒత్తిడి పెంచుతోంది. దీంతో.. వాళ్లు గ్రామాలకు వెళ్లి భూసేకరణ చేపట్టారు. అయితే.. గతంలో ఇళ్ల కోసం కేటాయించిన భూములు లాక్కోవడం ఏమిటంటూ అల్లంవారిపాలెం గ్రామస్తులు నిలదీశారు. బలవంతంగా తమ స్థలాలు లాక్కుంటే.. బలవన్మరణానికి పాల్పడతామంటూ గ్రామస్తులు హెచ్చరించారు. పురుగు మందు డబ్బాలు చేతిలో పట్టుకుని ఆందోళనకు దిగారు. ప్రభుత్వానికి, అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

Similar News