కరోనాపై పోరుకు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి భారీ విరాళం

Update: 2020-04-01 22:39 GMT

దేశంలో వేగంగా వ్యాప్తి చెందుతున్న కరోనాను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వంతో పాటు అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు తీవ్రస్థాయిలో కృషి చేస్తున్నాయి. ఈ కరోనా మహమ్మారిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న పోరాటానికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌ రెడ్డి తన వంతు సహాయం అందించారు. కరోనా నియంత్రణ చర్యల కోసం తన ఎంపీ ల్యాడ్స్‌ నిధుల నుంచి పీఎం కేర్స్‌ నిధికి రూ.1 కోటి విరాళంగా ఇస్తున్నట్టు ప్రకటించారు. అలాగే, తెలంగాణ సీఎం సహాయ నిధికి రూ.50లక్షలు, హైదరాబాద్‌ కలెక్టర్‌ నిధికి రూ.50లక్షల చొప్పున విరాళం ప్రకటించారు.

Similar News