తెలంగాణలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగాయి. గురువారం ఒక్కరోజే 27 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 154కి చేరింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 17 మంది కరోనా బాధితులు కోలుకోగా.. 9 మంది మృతి చెందినట్లు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.