AP : ఏపీలో 1.81 లక్షల ఇంజినీరింగ్ సీట్లు

Update: 2024-07-04 06:06 GMT

ఏపీలో అన్నిరకాల ప్రభుత్వ, ప్రైవేటు పరిధిలోని 245 ఇంజినీరింగ్ కాలేజీలు, డీమ్డ్ వర్సిటీల్లో 1,81,732 సీట్లకు AICTE ఆమోదం తెలిపింది. CSE, AI, డేటా సైన్స్, IT కోర్సుల్లోనే 1,37,194 సీట్లు ఉన్నాయి. ప్రైవేటు కాలేజీల్లో మొత్తంగా 1.65 లక్షల సీట్లు ఉండగా, ఇందులో 70% కన్వీనర్ కోటాలో, 30% యాజమాన్య కోటాలో భర్తీ చేస్తారు. కాగా ఈ ఏడాది కొత్తగా తిరుపతి, విశాఖలో 2 ఇంజినీరింగ్ కాలేజీలకు అనుమతి లభించింది.

ఇంజినీరింగ్‌ సీట్లలో అత్యధికంగా కంప్యూటర్‌ సైన్సు, ఎమర్జింగ్‌ కోర్సుల్లోనే ఉన్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో మొత్తం 1,71,079 సీట్లు ఉంటే సీఎస్‌ఈ, ఏఐ, మెషీన్‌లెర్నింగ్, డేటా సైన్స్, ఐటీలాంటి కోర్సుల్లో 1,37,194 సీట్లు ఉన్నాయి. మొత్తం సీట్లలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలకు సంబంధించినవే 80% ఉన్నాయి.

ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్‌ కళాశాలల్లో ఐటీ బ్రాంచిలో ఈ ఏడాది 60 సీట్లు, శ్రీకృష్ణదేవరాయ వర్సిటీ ఇంజినీరింగ్‌ కళాశాలలో సీఎస్‌ఈ (ఏఐ, మెషీన్‌లెర్నింగ్, డేటా సైన్స్‌)లో 120 సీట్లు అదనంగా వచ్చాయి. జిల్లాలవారీగా చూస్తే ఉమ్మడి గుంటూరులో అత్యధికంగా 26,760 సీట్లు ఉండగా.. ఉమ్మడి కృష్ణాలో 20,595 సీట్లు ఉన్నాయి. అత్యల్పంగా ఉమ్మడి శ్రీకాకుళంలో 3,360 సీట్లు అందుబాటులో ఉన్నాయి.

Tags:    

Similar News