కాకినాడ, పరిసర ప్రాంతాల్లోని రెండు గోదాముల్లో రూ.52.39 కోట్ల విలువైన 18,526 టన్నుల రేషన్ బియ్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సోమవారం వరకు పట్టుకున్న 15,396 టన్నుల(రూ.43.43 కోట్ల) రేషన్ బియ్యానికి ఈ సరుకు అదనం. కాగా కాకినాడ పోర్టు కేంద్రంగా రేషన్ మాఫియా అవినీతికి పాల్పడుతోందని మంత్రి నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. వీటిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
లోటస్ మెరైన్ లాజిస్టిక్స్‌లో రూ.25.18 కోట్ల విలువైన 8,280 టన్నులు, కాంక్వైర్ గోదాములో రూ.28.21 కోట్ల విలువైన 9,246 టన్నుల బియ్యం పట్టుకున్నారు. సోమవారం వరకు స్వాధీనం చేసుకున్న రూ.43.43 కోట్ల విలువైన 15,396 టన్నుల రేషన్ బియ్యానికి ఈ సరకు అదనం. గోదాముల్లో దాడులు నిరంతరాయంగా కొనసాగుతాయని పౌర సరఫరాల శాఖ అధికారులు తెలిపారు.