AP Corona cases : ఏపీలో కొత్తగా 2,145 కేసులు.. 24 మరణాలు
AP corona cases : ఏపీలో కరోనా ఉదృతి కొనసాగుతుంది. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 82,297 నమూనాలను పరీక్షించగా 2,145 మందికి కరోనా అని తేలింది.;
AP corona cases : ఏపీలో కరోనా ఉదృతి కొనసాగుతుంది. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 82,297 నమూనాలను పరీక్షించగా 2,145 మందికి కరోనా అని తేలింది. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 19,76,141కి చేరింది. ఇక అటు కరోనాతో మరో 24 మంది ప్రాణాలను కోల్పోయారు. దీనితో మృతుల సంఖ్య 13,468కి పెరిగింది. ఇక మరోవైపు కరోనా నుంచి 2,003 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 20,302 యాక్టివ్ కేసులున్నాయి. కాశం జిల్లాలో ఐదుగురు, చిత్తూరు, కృష్ణ జిల్లాల్లో నలుగురు, కడప, పశ్చిమగోదావరిలో ముగ్గురు, తూర్పుగోదావరి జిల్లాలో ఇద్దరు, అనంతపురం, గుంటూరు జిల్లాల్లో ఇద్దరు, విశాఖపట్నంలో ఒకరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖా హెల్త్ బులిటెన్ ని విడుదల చేసింది.