East Godavari: స్నేహితుడి బర్త్‌డే పార్టీకి వెళ్లొస్తుండగా ప్రమాదం.. ముగ్గురు యువకులు మృతి..
East Godavari: తూర్పుగోదావరిలో రోడ్డు ప్రమాదం జరిగింది. హుకుంపేట డీమార్ట్ వద్ద కారు విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది.;
East Godavari: తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో రోడ్డు ప్రమాదం జరిగింది. హుకుంపేట డీమార్ట్ వద్ద కారు విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. స్నేహితుడి బర్త్ డే వేడుకలు చేసుకుని.. ధవళేశ్వరం నుండి విశాఖపట్నం వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. ఘటనా స్థలంలోనే బత్తిన జయదేవ గణేష్ అనే యువకుడు చనిపోయాడు. చికిత్స పొందుతూ సురేష్, మరో యువకుడు మృతి చెందాడు. బాధితులంతా ధవళేశ్వరానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.