AP : జనసేనకు ఉపాసన రూ. 5 కోట్ల విరాళం?

Update: 2024-04-08 07:03 GMT

ఏపీ (AP) సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జనసేన (Janasena) పార్టీకి రామ్ చరణ్ భార్య, కొణిదెల ఉపాసన (Upasana) రూ. 5 కోట్ల విరాళం ఇచ్చారంటూ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఐతే.. ఇందులో వాస్తవం లేదని స్పష్టమవుతోంది. ఉపాసన మెగా కోడలు కావడంతో ఈ వార్త వైరల్ అయిందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఏపీలో ప్రస్తుతం జనసేన 21 స్థానాల్లో పోటీ చేస్తుంది. రాయలసీమలో రైల్వే కోడూరు, తిరుపతి రెండు నియోజకవర్గాల్లో పోటీ పడుతోంది. పొత్తులో భాగంగా నష్టపోయినా.. పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలవాలని పవన్ పట్టుదలగా ఉన్నారు.

ఉపాసన విరాళం ఇచ్చిందంటూ వచ్చిన వార్తలు ఫేక్‌ అయినప్పటికీ ఫ్యూచర్లో ఉపాసన జనసేన పార్టీకి నిజంగా ఫండ్స్ ఇస్తే బాగుంటుందని తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు.. పవన్ కల్యాణ్ కు ఎన్నికల్లో తోడుంగా ఉండేందుకు వారి ఫ్యామిలీ ఆర్థిక, ప్రచార సహకారం అందిస్తుందని చెబుతున్నారు. త్వరలోనే పవన్ కొత్త సినిమాలతో ఫ్యాన్స్ లో జోష్ నింపే ప్రయత్నం చేస్తున్నారు మూవీ మేకర్స్.

Tags:    

Similar News