AP : 66 ఏళ్లొచ్చినా పాలిటిక్స్‌లో అయ్యన్నపాత్రుడు ఫైర్ బ్రాండే : సీఎం చంద్రబాబు

Update: 2024-06-22 07:16 GMT

ఏపీ స్పీకర్‌గా ఎన్నికైన అయ్యన్నపాత్రుడికి సీఎం చంద్రబాబు ( CM Chandrababu Naidu ) అసెంబ్లీలో శుభాకాంక్షలు తెలిపారు. ‘ఓ బీసీ నేత సభాధ్యక్ష స్థానంలో కూర్చోవడం ఆనందంగా ఉంది. NTR పిలుపుతో అయ్యన్న రాజకీయాల్లోకి వచ్చారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి కృషి చేశారు. ఏ పదవి చేపట్టినా వన్నె తెచ్చారు. 66 ఏళ్లొచ్చినా పాలిటిక్స్‌లో ఆయన ఫైర్ బ్రాండే. గత ఐదేళ్లలో రాజకీయంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నా ధైర్యంగా నిలబడి ఎదుర్కొన్నారు’ అని కొనియాడారు.

అసెంబ్లీ సమావేశాల సందర్భంగా గతంలో సభలో తనను అవమానించిన ఘటనను సీఎం చంద్రబాబు గుర్తుచేసుకున్నారు. ‘నా గురించి, నా కుటుంబం గురించి నీచంగా మాట్లాడారు. వారిపై యాక్షన్ తీసుకోకపోగా నిరసన తెలియజేయడానికి మైక్ అడిగితే ఇవ్వలేదు. అయినా రికార్డ్ కోసం స్టేట్‌మెంట్ ఇచ్చా. ముఖ్యమంత్రిగానే ఈ సభలో అడుగుపెడతాను తప్ప మళ్లీ అడుగుపెట్టను అని చెప్పా’ అంటూ అప్పటి కామెంట్స్‌ను మరోసారి ఆయన చదివి వినిపించారు.

రెండో రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. నిన్న అసెంబ్లీకి హాజరు కాలేని ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రమాణ స్వీకారం చేయించారు. జీవీ ఆంజనేయులు, పితాని సత్యనారాయణ, వనమాడి వెంకటేశ్వరరావు ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేశారు.

అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ ఎన్నికపై సందిగ్ధత నెలకొంది. ఇప్పటికీ దీనికి సంబంధించి ఎటువంటి నోటిఫికేషన్ జారీ కాలేదు. జులైలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లోనే డిప్యూటీ స్పీకర్ ఎన్నిక జరిగే అవకాశం ఉంది. కూటమి పార్టీల్లో ఎవరికి ఈ పదవి ఇవ్వాలనే దానిపై ఇంకా స్పష్టత రాకపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. కాగా ఇవాళ ఉదయం 11గంటలకు స్పీకర్‌గా అయ్యన్నపాత్రుడు నియామకం తర్వాత సభ నిరవధిక వాయిదా పడనుంది.

Tags:    

Similar News