Renigunta Airport : రేణిగుంట విమానాశ్రయం వెళ్లే మార్గంలో తప్పిన పెను ప్రమాదం!

Update: 2025-08-07 14:00 GMT

రేణిగుంట విమానాశ్రయం వెళ్లే రోడ్డు మార్గంలో పెను ప్రమాదం తప్పింది. శ్రీ సిటీ నుంచి బెంగళూరుకు లోడ్ తో వెళ్తున్న లారీ అదుపుతప్పి బోల్తా కొట్టింది. వేగంగా వెళ్తున్న లారీకి స్కూటరిస్ట్ అడ్డు రావడంతో లారీ డ్రైవర్ సడన్ బ్రేక్ చేశాడు. దీంతో ఒక్కసారిగా అదుపు తప్పిన లారీ… వేగంగా రోడ్డుపై బోల్తా కొట్టింది. డ్రైవర్ క్యాబిన్ పూర్తిగా ధ్వంసం కాగా…. కంటైనర్ లో నిప్పు రాచుకుంది. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసు, అగ్నిమాపక సిబ్బంది…. డ్రైవర్ ను సురక్షితంగా భయటకు తీసుకువచ్చారు. కంటైనర్ లో వ్యాపించిన మంటలను అగ్నిమాపక సిబ్బంది అదుపులోకి తెచ్చారు. మరోవైపు నెల్లూరు జిల్లా రాపూరు మండలం ఓబులయపల్లి జాతీయ రహదారి పై ఘోర రోడ్డు ప్రమాదం తప్పింది. తమిళనాడు నుంచి కొబ్బరి కాయల లోడు లారీ కనిగిరి కి ప్రయాణిస్తుండగా రాపూరు మండలం ఓబులాయపల్లి గ్రామ నేషనల్ హైవే రోడ్డుపై స్కూల్ వ్యాన్ అడ్డురావడంతో లారీని తప్పించబోయి పక్కనున్న దుకాణంలోకి దూసుకెళ్లిన లారీ, అదృష్టవంతు దుకాణంలోఎవరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.స్కూలు వ్యాను అడ్డు రావడంతో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు వెల్లడించారు.

Tags:    

Similar News