Botsa Satyanarayana : సొంత ఇలాకాలో "బొత్స"కు వరుస షాక్ లు..

Update: 2025-10-07 05:15 GMT

మాజీ మంత్రి బొత్స సత్యనారాయణకు వరుస షాక్ లు తగులుతున్నాయి. వైసిపి అధికారంలో ఉన్నప్పుడు ఇష్టానుసారంగా వ్యవహరించిన ఆయన.. విజయనగరం జిల్లాను తన కనుసైగలతో అల్లాడించారు. ఆయన తీరుతో విసిగిపోయిన ప్రజలు జిల్లాలో టీడీపీకి పట్టం కట్టారు. దీంతో జిల్లాలో ఆయన హవాకు బ్రేక్ పడింది. అధికారం ఉన్నా లేకపోయినా గతంలో జిల్లాలో తాను అనుకున్నది చేసేవారు. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం చాలా కఠినంగా ఉండడంతో బొత్స సత్యనారాయణ ఏది పడితే అది చేయలేకపోతున్నారు. పాతికేళ్లుగా విజయనగరం డిసిసిబిని తన గుప్పిట్లో పెట్టుకున్న ఆయన.. దాన్ని తన అడ్డాగా మార్చుకున్నారు. కూటమి వచ్చిన తర్వాత వెంటనే డిసిసిబి చైర్మన్ గా కిమిడి నాగార్జున ను నియమించింది. ఈ విషయం బొత్స సత్యనారాయణ కు మింగుడు పడటం లేదు.

దసరా తర్వాత సోమ, మంగళవారాల్లో పైడితల్లి అమ్మవారి ఊరేగింపులు జరుగుతాయి. సోమవారం తొలెల్లు, మంగళవారం సినిమానోత్సవం నిర్వహిస్తారు. ఈ సినిమానోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుంది. దీన్ని చూసేందుకు బొత్స కుటుంబం డిసిసిబి బిల్డింగ్ పై వేదిక ఏర్పాటు చేసుకొని.. అక్కడి నుంచే వీక్షించడం ఆలవాయితీగా మార్చుకుంది. ప్రభుత్వపరంగా దానికి పర్మిషన్ లేకపోయినా.. బొత్స తనకున్న రాజకీయ పరిచయాలతో గతంలో నుంచే ఇలా చేస్తున్నారు. అయితే ఈసారి మాత్రం బొచ్చ కుటుంబానికి ఆ ఏర్పాట్లు చేయలేదని నాగార్జున తేల్చి చెప్పేశారు. డిసిసిబి బిల్డింగ్ అంటే ప్రభుత్వ పరమైన ఆఫీస్ అని.. ఇలాంటి రాజకీయ నాయకులకు వేదిక కాదని తేల్చేస్తున్నారు. కిమిడి నాగార్జున మొదటి నుంచి మంత్రి నారా లోకేష్ కు అత్యంత సన్నిహితుడుగా వ్యవహరిస్తున్నారు. లోకేష్ అడుగుజాడల్లోనే నడుస్తున్నాడు. ప్రభుత్వపరమైన ఆఫీసుల దగ్గర ఎలాంటి రాజకీయ సభలు సమావేశాలు వేదికలు నిర్వహించొద్దని గతంలోనే లోకేష్ ఆదేశించారు. ఆయన ఆదేశాలకు తగ్గట్టే నాగార్జున ఈ ప్రకటన చేశారు.

బొత్స అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు కాబట్టి ప్రోటోకాల్ ప్రకారం ఏర్పాట్లు ఉంటాయి తప్ప ప్రత్యేకంగా వేదిక ఏర్పాటు చేయట్లేదని సూచించారు.

దీంతో బొత్సకు భారీ షాక్ తగిలింది. నాగార్జున ప్రభుత్వ పరంగా వ్యవహరిస్తున్నా సరే.. బొత్స మాత్రం తనకు వేదిక కావాల్సిందే అన్నట్టు పట్టుబడుతున్నారు. ఇందుకోసం రెవెన్యూ అధికారుల్లో తనకు ఉన్న పరిచయాలతో వారి మీద ఒత్తిడి చేస్తున్నారు. రీసెంట్ గానే రెవెన్యూ అధికారులు డిసిసిబి చైర్మన్ తో మాట్లాడి చూశారు. అయినా సరే డిసిసిబి చైర్మన్ మాత్రం వెనక్కి తగ్గలేదు. ఇన్నేళ్లు డిసిసిబి బిల్డింగును బొచ్చ తను అడ్డగా మార్చుకొని.. ఇష్టారాజ్యంగా వ్యవహరించాడని ఇప్పుడు దానికి తాము ఒప్పుకోమని తేల్చేశారు. ఈ దెబ్బతో జిల్లాలో బొత్సకు ఇమేజ్ తగ్గిపోతుందనే టెన్షన్ లో పడ్డాడు. కూటమి ప్రభుత్వం బొత్స కు ఉన్న అధికారాన్ని బట్టి ప్రోటోకాల్ ఏర్పాటు చేసేందుకు సిద్ధంగానే ఉంది. అంతకుమించి మంత్రి హోదాలో ఏర్పాట్లు కావాలనట్టు ఆయన ఆశిస్తున్నారు. కానీ టిడిపి నేతలు మాత్రం అందుకు ఒప్పుకోకుండా ఆయనకు ఈ విధంగా చెక్ పెడుతున్నారు.

Tags:    

Similar News