AP: టెన్షన్ ఆడవారికి షుగర్ మగవాళ్లకి

ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లో కీలక అడుగు;

Update: 2025-04-08 09:00 GMT

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం... ఆరోగ్య ఏపీ దిశగా కీలక ముందడుగు వేసింది. ఏపీలో ప్రజలు ప్రధానంగా ఎదుర్కొంటున్న వ్యాధులకు మూలాలు... వాటి వెనుక ఉన్న కారణాలు కనుక్కునే ప్రయత్నం ప్రభుత్వం చేసింది. గుండె, కిడ్నీ, శ్వాస సంబంధిత వ్యాధుల నుంచి డయాబెటిస్, క్యాన్సర్ వంటి రోగాల వరకు... ఏ ప్రాంతంలో ఎందుకు ఎక్కువ కేసులు నమోదవుతున్నాయనే దానిపై పరిశోధన చేయగా... సరికొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆయా జిల్లా ప్రజల ఆహారపు అలవాట్లు-జీవన విధానం వ్యాధులపై ఎక్కువ ప్రభావం చూపిస్తోంది.రాష్ట్రంలో ప్రజలు అనారోగ్యం బారిన పడ్డ తర్వాత వారికి చికిత్స అందించడం కన్నా... కొన్ని రకాల వ్యాధులు సంక్రమించకుండా... ముందు జాగ్రత్త చర్యలు తీసుకుని చాలావరకు నియంత్రించవచ్చని గుర్తించారు. ప్రతి జిల్లాను ఒక యూనిట్‌గా తీసుకుని పరిశోధన. 10 రకాల వరకు వ్యాధుల గురించి అధ్యయనం చేశారు. మహిళల్లో ఎక్కువగా హైపర్‌ టెన్షన్ ఉండగా.. మగవాళ్లలో షుగర్ ఎక్కువగా ఉందని అధ్యయనంలో తేలింది. హైపర్ టెన్షన్, డయాబెటిస్ రెండూ ఉన్న వారు ఏపీలో 9.6 శాతం మంది ఉన్నారు. 2,61,100 మంది గుండె సంబంధిత సమస్యలు ఎదుర్కొంటున్నారు. వీరిలో మగవాళ్లు 1,61,734 మంది కాగా, మహిళలు 99,366 మంది ఉన్నారు.

Tags:    

Similar News