AB Venkateswara Rao : రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నోటీసుపై గట్టి రిప్లై ఇచ్చిన సీనియర్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు
ab venkateswara rao : మీడియా సమావేశం నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నోటీసుకు గట్టి రిప్లై పంపారు సీనియర్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు.;
ab venkateswara rao : మీడియా సమావేశం నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నోటీసుకు గట్టి రిప్లై పంపారు సీనియర్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు. వ్యక్తిత్వ దూషణలు, ఆరోపణలపై స్పందించే అవకాశం.. ఆలిండియా సర్వీస్ రూల్స్ కల్పించాయని లేఖలో పేర్కొన్నారు. తనకు ఇచ్చిన నోటీసులోనే పేర్కొన్న రూల్ 17 నియమానికి అనుగుణంగా..మీడియాతో మాట్లాడినట్లు వెల్లడించారు. తాను ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ఉండగా.. పెగాసస్ సాఫ్ట్‌వేర్ వినియోగించలేదని మాత్రమే చెప్పానని.. ఆలిండియా సర్వీస్ రూల్స్ 6 ప్రకారం.. అధికారిక అంశాలపై స్పష్టత ఇచ్చే అవకాశం ఉందన్నారు.
రూల్ నెంబర్-3 ప్రకారం అధికారులు పాదర్శకంగా, జవాబుదారీతనంగా ఉండాలని.. మీడియా సమావేశంలో ప్రభుత్వాన్ని ఎక్కడా విమర్శించలేదన్నారు. గౌరవానికి భంగం కలిగించేలా తనపై, తన కుటుంబంపై.. ఆరోపణలు చేస్తే స్పందించకుండా ఎలా ఉంటానని అన్నారు. రాజ్యంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం లభించిన ప్రాథమిక హక్కు మేరకే వ్యక్తిగత ఆరోపణలపై వివరణ ఇచ్చానన్నారు. మీడియా సమావేశం విషయాన్ని ముందుగానే ప్రభుత్వానికి తెలిపానని వెల్లడించారు. అటు.. ఎంపీ విజయసాయి చేసిన ట్వీట్‌ను కూడా వివరణలో పేర్కొన్నారు.