రెండేళ్లలో రైతులకు జగన్ చేసిందేమీ లేదు: అమర్‌నాథ్‌రెడ్డి
అధికార పార్టీపై అసంతృప్తితోనే తాము టీడీపీలో చేరామని యువకులు చెప్పారు..;
తిరుపతి ఉపఎన్నికల్లో టీడీపీ ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గంలోని చిల్లకూరులో టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మి ప్రచారం నిర్వహించారు.. మాజీమంత్రి అమర్‌నాథ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్‌తో కలిసి ఆమె ప్రచారం చేశారు. ఈ సందర్భంగా పలువురు టీడీపీలో చేరారు.
పాలిచెర్లవారిపాలేనికి చెందిన 100 మంది యువకులకు కండువా కప్పి.. పార్టీలోకి ఆహ్వానించారు. అధికార పార్టీపై అసంతృప్తితోనే తాము టీడీపీలో చేరామని యువకులు చెప్పారు.. రెండేళ్లలో రైతులకు జగన్ చేసిందేమీ లేదని అమర్‌నాథ్‌రెడ్డి మండిపడ్డారు. సీఎం జగన్ మద్యం అమ్మకాల రూపంలో ప్రజల రక్తం తాగుతున్నారని విమర్శించారు.