Guntur : అధికార పార్టీ నేతల అత్యుత్సాహం.. భారీ ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకున్న అంబులెన్స్..!
Guntur : గుంటూరు పశ్చిమ నియోజకవర్గం వేలంగిని నగర్‌లో రోడ్డుపైనే ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ నిర్వహించిన గడప గడపకు కార్యక్రమంతో భారీగా ట్రాఫిక్ జామైంది.;
Guntur : అధికార పార్టీ నేతల అత్యుత్సాహం రోగుల ప్రాణాలమీదికి తెస్తోంది. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం వేలంగిని నగర్‌లో రోడ్డుపైనే ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ నిర్వహించిన గడప గడపకు కార్యక్రమంతో భారీగా ట్రాఫిక్ జామైంది. రోగిని తీసుకెళ్తున్న అంబులెన్స్ ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకుపోయింది. అంబులెన్స్‌కు దారి లేక అందులోని రోగి, బంధువులు ఆందోళనకు లోనయ్యారు.
సకాలంలో రోగిని ఆసుపత్రికి చేర్చలేకపోయారు. అంబులెన్స్‌లు ట్రాఫిక్ లో గంటలతరబడి చిక్కుకుని రోగి ప్రాణాలు కోల్పోతే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రజలు మండిపడుతున్నారు. సరిగ్గా బడులు, కళాశాలలు, కార్యాలయాల నుండి ఉద్యోగులు ఇంటికి వెళ్లే సమయంలో ఇటువంటి కార్యక్రమాలు ప్రధాన రహదారులపై చేస్తే ర్యాలీలు నిర్వహించడంపై ఫైరయ్యారు.
ఇకనైనా ప్రభుత్వ కార్యక్రమాలు చేసే సమయంలో ఎవరికీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని కోరుతున్నారు.