Andhra Pradesh: 'జగన్ సర్కార్ విధానాల కారణంగానే ఏపీలో అభివృద్ధి కుంటుపడింది'
Andhra Pradesh: జగన్ సర్కార్ అవలంబిస్తున్న విధానాల కారణంగానే ఏపీలో అభివృద్ధి కుంటుపడిందని అభిప్రాయపడ్డారు మేధావులు.;
Andhra Pradesh: జగన్ సర్కార్ అవలంబిస్తున్న విధానాల కారణంగానే ఏపీలో అభివృద్ధి కుంటుపడిందని అభిప్రాయపడ్డారు మేధావులు. ఆంధ్రప్రదేశ్ ప్రొఫెషనల్ ఫోరం ఆధ్వర్యంలో ఏపీ పునర్నిర్మాణ సదస్సు ఒంగోలు జరిగింది. వివిధ రంగాల్లో రాష్ట్ర అభివృద్ధికి ప్రభుత్వం ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలి అనే దానిపై చర్చ నిర్వహించారు. రాష్ట్రంలో వ్యవసాయ రంగం అభివృద్ధితో పాటు పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఏపీ ప్రొఫెషనల్ ఫోరం ప్రెసిడెంట్మ మహేశ్వర రావు అన్నారు.అర్థం పర్థం లేని ఆర్థిక విధానాలతో ఏపీ ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందని విమర్శించారు.