AP : నరసాపురం నుంచి తిరువణ్మలై స్పెషల్ ట్రైన్ తో పాటు ఏపీకి మరో వందేభారత్

Update: 2025-07-10 08:00 GMT

నరసాపురం నుంచి తిరువణ్మలై( అరుణాచలం ) స్పెషల్ ట్రైన్ ను నరసాపురం ఎంపీ కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. తీర ప్రాంతం నుండి తిరువణ్మలై కు డైరెక్ట్ ట్రైన్ లేక భక్తులు అనేక ఇబ్బందులు పడుతుండటం తో కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ చొరవతో నరసాపురం - తిరువణ్మలై స్పెషల్ ట్రైన్ ను రైల్వే శాఖ వేశారు ఈ ట్రైన్ బుధవారం ఉదయం 12:30 కి బయలు దేరి మరుసటి రోజు ఉదయం 5 గం లకు తిరువణ్మలై చేరుతుంది మళ్ళీ గురువారం ఉదయం 12 గం లకు తిరువణ్మలై లో బయలు దేరి శుక్రవారం ఉదయం నరసాపురం చేరుకుంటుంది. ప్రయాణికుల రద్దీన్బట్టి నరసాపురం - తిరువణ్మలై ట్రైన్ ను రెగ్యులర్ చేసే విధంగా కృషి చేస్తానని తెలిపారు.

నరసాపురం చెన్నై ల మధ్య వందే భారత్

అలాగే త్వరలో నరసాపురం చెన్నై ల మధ్య వందే భారత్ ట్రైన్ను ప్రారంభించనున్నారని కేంద్ర మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్ బిజెపి నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Tags:    

Similar News