AP : ఉద్యోగులను బిచ్చగాళ్లను చేసిన ఘనత జగన్‌దే : జూలకంటి
రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి చర్చకు సిద్ధమా అంటూ వైసీపీ నాయకులకు సవాల్ విసిరారు. టీడీపీ నేతలను హత్య చేసి వారిని అణగదొక్కడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు;
రాష్ట్రంలో రైతులను,ఉద్యోగులను బిచ్చగాళ్లను చేసిన ఘనత జగన్‌దే అన్నారు మాచర్ల టీడీపీ ఇన్‌చార్జ్ జూలకంటి బ్రహ్మానంద రెడ్డి. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి చర్చకు సిద్ధమా అంటూ వైసీపీ నాయకులకు సవాల్ విసిరారు. టీడీపీ నేతలను హత్య చేసి వారిని అణగదొక్కడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. మైనింగ్ మాఫియాగా మారిన ఓ ఎమ్మెల్యే... తెలంగాణ నుంచి మద్యం తెచ్చి అమ్ముతున్నారని విమర్శించారు. ఎమ్మెల్యే, అతని తమ్ముడు హింసాత్మక ఘటనలకు పాల్పడుతున్నారని ఆరోపించారు జూలకంటి.
మిరియాల గ్రామంలో టీడీపీ కార్యకర్తలను కలుసుకునేందుకు వెళితే పోలీసులు అడ్డుకున్నారని, దేవాలయాన్ని సందర్శించడానికి ట్రాక్టర్‌పై వెళితే ఆ ట్రాక్టర్‌ను కూడా వైసీపీ నేతలు తగలబెట్టారని మండిపడ్డారు. ప్రతిపక్ష నేతల ఇళ్లలో శుభకార్యాలకోసం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను కూడా కాల్చేయడం వైసీపీ నాయకులకు ఓ తంతు గా మారిందని అన్నారు. రాబోయే రోజుల్లో వైసీపీ నేతలు యుద్ధ ట్యాంకులు దించి దౌర్జన్యాలు చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదని సెటైర్ వేశారు జూలకంటి.