ఏపీ కేబినెట్ సమావేశం ఇవాళ ఉదయం 11 గంటలకు జరగనుంది. అసెంబ్లీ సమావేశాలు, బీపీసీఎల్ రిఫైనింగ్ ప్రతిపాదనలు, ఇసుక పాలసీ విధివిధానాలు, తల్లికి వందనం, ఎక్సైజ్ పాలసీ, ఓటాన్ బడ్జెట్ తదితర అంశాలపై మంత్రివర్గం చర్చించనున్నట్లు సమాచారం. కేబినెట్ భేటీ అనంతరం సీఎం చంద్రబాబు ఢిల్లీ వెళ్లనున్నారు. అమిత్ షాను కలిసి విభజన సమస్యలపై చర్చించే అవకాశం ఉంది.మరోవైపు అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, సీపీలతో చంద్రబాబు సమావేశం కానున్నారు. ధరణి, వ్యవసాయం, ప్రజాపాలన, వాతావరణ పరిస్థితులు, సీజనల్ వ్యాధులు, ఆరోగ్యం, వన మహోత్సవం, విద్య, మహిళా శక్తి, డ్రగ్స్, శాంతి భద్రతలు వంటి అంశాలపై ముఖ్యమంత్రి చర్చించనున్నారు.