CBN: ప్రధానితో భేటీ కానున్న చంద్రబాబు

కీలక అంశాలు చర్చించనున్న చంద్రబాబు.. అమిత్‌ షా సహా కేంద్రమంత్రులతోనూ భేటీ;

Update: 2024-10-07 02:00 GMT

సీఎం చంద్రబాబు రెండు రోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. సాయంత్రం ప్రధాని మోదీతో భేటీ కానున్నారు. అనంతరం రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో సమావేశమవుతారు. కాగా పర్యటనలో రైల్వే జోన్‌, సెయిల్‌లో విశాఖ ఉక్కు విలీనం, వరద నిధులపై చర్చించే అవకాశముంది. ప్రపంచ బ్యాంకు నుంచి అమరావతి నిర్మాణానికి నిధుల్లో ఆటంకం లేకుండా చూడాలని కోరనున్నట్టు సమాచారం.

ప్రధానితో భేటీ

సాయంత్రం 4.30 గంటలకు ప్రధాని మోదీతో భేటీ కానున్నారు. అనంతరం రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో సమావేశమవుతారు. కేంద్ర మంత్రులు అమిత్ షా, గడ్కరీ, నిర్మలా సీతారామన్‌తో మంగళవారం భేటీ కానున్నారు. బుడమేరు వరదలపై కేంద్రానికి నివేదిక ఇచ్చిన తర్వాత చంద్రబాబు.. ప్రధానిని కలవడం ఇదే తొలిసారి. రైల్వే జోన్‌, సెయిల్‌లో విశాఖ ఉక్కు విలీనం, వరద నిధులపై చర్చించే అవకాశముంది. ప్రపంచ బ్యాంకు నుంచి అమరావతి నిర్మాణానికి నిధుల్లో ఆటంకం లేకుండా చూడాలని చంద్రబాబు కోరనున్నట్టు సమాచారం. రాష్ట్రానికి రావలసిన వరద సహాయం నిధులు, విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుతో పాటు.. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో విశాఖ ఉక్కు విలీనం వంటి కీలక అంశాలపై చర్చించనున్నారు. రాష్ట్ర రాజధాని అమరావతి అభివృద్ధికై కేంద్రం మద్దతుతో ప్రపంచ బ్యాంకు రూ.15 వేల కోట్ల రుణం మంజూరు చేయగా.. దానిపై కూడా ప్రధానితో చర్చించనున్నారు. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నుంచి తొలివిడతగా ఇస్తామన్న రూ.12 వేల కోట్ల నిధులు ఎలాంటి ఆటంకం లేకుండా రాష్ట్రానికి వచ్చేలా చూడాలని కోరనున్నట్లు సమాచారం. రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తోనూ భేటీ అయ్యి రాష్ట్రంలో పూర్తి చేయాల్సిన రైల్వే ప్రాజెక్టులపై చర్చించనున్నారు.

మంగళవారం పర్యటన ఇలా..

రేపు హోంమంత్రి అమిత్ షా తో సమావేశవై పలు కీలక అంశాలపై చర్చిస్తారు. అనంతరం కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ లతో భేటీ కానున్నారు. కేంద్రం నుంచి రావలసిన నిధులు వస్తేనే కూటమి సర్కార్ కు సూపర్ సిక్స్ పథకాల అమలు సాధ్యమవుతుందని విశ్లేషకులు చెబుతున్నారు.

రోజా సంచలన వ్యాఖ్యలు

సీఎం చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో ఆరేళ్ల చిన్నారి హత్యకు గురికావడం దారుణమని మాజీ మంత్రి రోజా ఆరోపించారు. చంద్రబాబు పాలనలో రాష్ట్రంలో మహిళలకు, పిల్లలకు రక్షణ కరువైందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో దారుణాలు జరుగుతున్నా సీఎం, డిప్యూటీ సీఎం, హోంమంత్రి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. పోలీసులను కేవలం కక్షసాధింపు చర్యలకు మాత్రమే వాడుతున్నారని రోజా దుయ్యబట్టారు.

Tags:    

Similar News