CBN: నేడు అమరావతిలో చంద్రబాబు పర్యటన

అమరావతిలోని అన్ని ప్రాంతాల్లో పర్యటించనున్న చంద్రబాబు;

Update: 2024-06-20 03:30 GMT

ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ రాజధాని అమరావతిలో పర్యటించనున్నారు. గత ప్రభుత్వం కూల్చేసిన ప్రజావేదిక నుంచి మొదలుపెట్టి.. శంకుస్థాపన ప్రాంతం, వివిధ దశల్లో ఉన్న నివాస సముదాయాల నిర్మాణాలను పరిశీలించనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అడిగే ప్రశ్నలకు ఎలా సమాధానం చెప్పాలా అని అధికారులు మథనపడుతున్నారు. మరోవైపు అమరావతిలోని అన్ని ప్రాంతాలను పరిశీలించనున్న చంద్రబాబు అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేయనున్నారు. ఇప్పటికే పోలవరాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించిన చంద్రబాబు ఇప్పుడు అమరావతిలో పర్యటించనున్నారు.

ఫర్నీచర్‌ రగడ

తాడేపల్లిలోని వైఎస్ జగన్ నివాసంలో ప్రభుత్వం ఫర్నిచర్ విషయంలో చెలరేగుతున్న వేళ కీలక ముందడుగు పడింది. గత ప్రభుత్వంలో పనిచేసిన సీఎంవో సెక్రటరీలకు జీఏడీ లేఖ రాసింది. క్యాంపు ఆఫీసులో వినియోగించిన ఫర్నిచర్ తిరిగి ఇవ్వాలని లేఖలో పేర్కొంది. జగన్ మోహన్ రెడ్డి హయాంలో ప్రభుత్వ సొమ్ముతో సీఎం క్యాంపు కార్యాలయం కోసం ఫర్నీచర్ కొనుగోలు చేశారని.. అయితే ప్రభుత్వం మారినప్పటికీ ఇంకా వాటిని తిరిగి అప్పగించలేదని టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. అయితే ఫర్నీచర్‌ను ప్రభుత్వానికి సరెండర్ చేసేందుకు లేఖ రాయగా.. విలువ కట్టి చెప్తే ధర చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నామంటూ వైసీపీ నేతలు కూడా స్పందించారు. దీంతో పాటు జగన్ పేషీలో సెక్రటరీలకు జీఏడీ లేఖ రాసింది. గత ప్రభుత్వంలో వినియోగించిన ఫర్నిచర్ తోపాటు ఇతర సామాగ్రిని ఇన్వెన్టరీ జాబితా ప్రకారం తిరిగి పంపాలని జీఏడీ లేఖ రాసింది. జగన్ సీఎంగా ఉన్న సమయంలో సీఎంవోలో సెక్రటరీలు ఇతరులకు ఫర్నిచర్, కంప్యూటర్లు ఇతర సామగ్రిని జీఏడీ పంపింది. ఆ మొత్తం సామాన్లు, ఇతర ఫర్నిచర్ వెనక్కి పంపాలని తాజాగా సెక్రటరీలకు లేఖ రాసింది. సీఎంవో ఇన్ ఛార్జ్ గా ఉన్న అధికారికి జీఏడీ లేఖ రాసింది. పదవికాలం పూర్తి అయ్యి 15 రోజులు అవుతున్నా ఇంకా ఫర్నిచర్ ఇతర సామగ్రిని అప్పగించలేదని అధికారులు చెబుతున్నారు. సెక్రటేరియట్ బిజినెస్ రూల్స్ ప్రకారం 15 రోజుల్లో ఫర్నిచర్, ఇతర సామగ్రిని అప్పగించాలనే నిబంధన ఉంది.

ఏపీ ప్రభుత్వం నుంచి సాధారణ పరిపాలన శాఖ అధికారులు ఈ లేఖ రాశారు. అలాగే జగన్ హయాంలో సీఎంవోలో పనిచేసిన సెక్రటరీలకు కూడా లేఖలు పంపినట్లు సమాచారం. ఫర్నీచర్, కంప్యూటర్లు, ఇతరత్రా సామాగ్రిని వెనక్కి పంపాలని లేఖలో పేర్కొన్నారు. తాడేపల్లిలోని వైఎస్ జగన్ నివాసాన్ని గత ప్రభుత్వంలో క్యాంపు ఆఫీసుగా చేశారు. క్యాంపు ఆఫీసులో సీఎం విధుల కోసం ఫర్నిచర్, ఇతర వస్తువులు జీఏడీ ఏర్పాటు చేసింది. సీఎంవో సెక్రటరీలకు ఈ ఫర్నిచర్ కేటాయించింది. అయితే ప్రభుత్వం మారిన తర్వాత ఈ ఫర్నిచర్ ను తిరిగి జీఏడీకి అప్పగించాల్సి ఉంది. 15 రోజుల గడువు ముగుస్తున్నా ఇంకా ఎలాంటి సమాధానం రాకపోయే సరికి జీఏడీ గత ప్రభుత్వ సీఎంవోలో పనిచేసిన సెక్రటరీలకు లేఖలు రాసింది.

Tags:    

Similar News