Andhra Pradesh : ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు అందని జీతాలు

Andhra Pradesh : మే మూడో తేదీ వచ్చినా... ఇప్పటి వరకు ఏపీలో చాలా మంది ఉద్యోగులకు జీతాలు అందలేదు.

Update: 2022-05-03 09:29 GMT

Andhra Pradesh : మే మూడో తేదీ వచ్చినా... ఇప్పటి వరకు ఏపీలో చాలా మంది ఉద్యోగులకు జీతాలు అందలేదు. ఎప్పుడు ఉద్యోగుల అకౌంట్‌లో పడతాయో కూడా తెలియని పరిస్థితి. అప్పులు దొరికితేనే ఉద్యోగులకు జీతాలు పడే అవకాశం ఉంది. మరోవైపు ఏపీ సర్కారు అప్పులకు కేంద్రం అనుమతి ఇవ్వడం లేదు. దీంతో కేంద్రం వద్ద రాష్ట్ర అధికారులు పడిగాపులు గాస్తున్నారు. రుణాలకు అనుమతులు ఇవ్వాలని కోరుతున్నారు.

అయితే.. ఇప్పట్లో అనుమతి వచ్చే అవకాశాలు కనిపించడం లేదని తెలుస్తోంది. దీంతో ఖజానాకు వచ్చిన నిధుల్ని వచ్చినట్లే జీతాలకు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. విడతల వారీగా ఉద్యోగులకు జీతాలు చెల్లించడం ద్వారా ఈ గడ్డు పరిస్థితి గట్టెక్కాలని భావిస్తున్నారుప్రతి నెల ఉద్యోగులను, రిటైర్డ్ ఎంప్లాయిస్‌లను టెన్షన్‌ పెట్టిస్తోంది జగన్ సర్కారు. వాస్తవానికి ప్రతి నెల 1న జీతాలు పడాలి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఒకటో తేదీన సాలరీలు, పించన్లు పడతాయేమోనని ఉద్యోగులు, పెన్షనర్లు ఆశగా ఎదురు చూస్తున్నారు ప్రతి నెల ఇదే తంతు కొనసాగడంతో జగన్ ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఏపీ ఉద్యోగులు.

ఉద్యోగులకు ఒకటో తేదీనే జీతాలు ఇవ్వాల్సి ఉంటుందని తెలిసినా.. జగన్ ప్రభుత్వం ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉంది. జీతాలు ఇచ్చే సమయానికి ఖజానాలో డబ్బులు ఉండడం లేదు. జీతాలు చెల్లించడం కోసం ప్రతి నెలా అప్పులపై ఆధారపడాల్సివస్తోంది. ఇక ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. కొన్ని డిపార్టుమెంట్ల వారికి కొన్ని నెలలుగా వేతనాలు అందడం లేదు.

Tags:    

Similar News