AP HIGH COURT: మరోసారి కోర్టులో వైసీపీకి బిగ్ షాక్

Update: 2025-08-15 01:30 GMT

పు­లి­వెం­దుల, ఒం­టి­మి­ట్ట­ల్లో తె­లు­గు­దే­శం పా­ర్టీ­ని ఓడిం­చేం­దు­కు మాజీ సీఎం జగన్ మో­హ­న్ రె­డ్డి చే­సిన ప్ర­య­త్నా­లు బె­డి­సి­కొ­ట్టా­యి. ఆ రెం­డు ప్రాం­తాల ప్ర­జ­లు సై­కి­ల్ వైపు ని­లి­చా­రు. దీం­తో ఫ్యా­న్ కొ­ట్టు­కు­పో­యిం­ది. టీ­డీ­పీ వి­జ­య­కే­త­నం ఎగు­ర­వే­య­గా వై­సీ­పీ­కి భారీ ఎదు­రు­దె­బ్బ తగి­లిం­ది. అయి­నా ఆ పా­ర్టీ నా­య­కు­లు వె­న­క్కి తగ్గే­ది­లే­ద­ని పో­రా­టం చే­సేం­దు­కు ప్ర­య­త్నం చే­శా­రు. కానీ ఆ పో­రా­టం నుం­చి వె­న­క్కి తగ్గా­ల్సి వచ్చిం­ది. కో­ర్టు తీ­ర్పు పె­ట్టు­కు­న్న ఆశలు సైతం గల్లం­త­య్యా­యి. దీం­తో రెం­డు చో­ట్ల ఓట­మి­ని ఒప్పు­కోక తప్ప­స­రి పరి­స్థి­తి ఆ పా­ర్టీ­ది అయిం­ది. పు­లి­వెం­దుల, ఒం­టి­మి­ట్ట జడ్పీ­టీ­సీ ఎన్ని­కల పో­లిం­గ్ లో అక్ర­మా­లు జరి­గా­య­ని వై­సీ­పీ నే­త­లు ఆరో­పిం­చా­రు. పు­లి­వెం­దుల, ఒం­టి­మి­ట్ట­లో రీ­పో­లిం­గ్ ని­ర్వ­హిం­చా­ల­ని హై­కో­ర్టు­లో పి­టి­ష­న్ దా­ఖ­లు చే­శా­రు. అయి­తే ఈ పి­టి­ష­న్‌­‌­ను ధర్మా­స­నం కొ­ట్టి­వే­సిం­ది. రీ­పో­లిం­గ్ వి­ష­యం ఎన్ని­కల కమి­ష­న్ చూ­సు­కుం­టుం­ద­ని, తాము జో­క్యం చే­సు­కో­లే­మ­ని తే­ల్చి చె­ప్పిం­ది. దీం­తో వై­ఎ­స్సా­ర్ కాం­గ్రె­స్ పా­ర్టీ శ్రే­ణు­ల­కు, ఆ పా­ర్టీ అధి­నేత జగ­న్‌­కు ఎదు­రు దె­బ్బ తగి­లి­న­ట్టైం­ది. సొంత ఇలాక అయిన పు­లి­వెం­దు­ల­ను పో­గొ­ట్టు­కో­వ­డం­తో జగ­న్‌­కు ఘోర పరా­భ­వం జరి­గి­న­ట్లు వై­సీ­పీ కా­ర్య­క­ర్త­లు ఫీల్ అవు­తు­న్నా­రు. ఈ సమ­యం­లో కో­ర్టు­పై పె­ట్టు­కు­న్న ఆశలు సైతం గల్లం­త­కా­వ­డం­తో తీ­వ్ర ఆవే­దన చెం­దు­తు­న్నా­రు.

జగన్‌కు అసలేమీ తెలియదు: హోంమంత్రి

గత 30 ఏళ్ల­లో కడ­ప­లో ఎక్క­డై­నా స్వ­చ్ఛం­దం­గా ఓటు వేసే పరి­స్థి­తి లే­ద­ని హోం మం­త్రి వం­గ­ల­పూ­డి అనిత అన్నా­రు. కనీ­సం నా­మి­నే­ష­న్ కూడా వేసే పరి­స్థి­తి లే­కం­డా జగన్ మో­హ­న్ రె­డ్డి రూల్ చే­శా­డు.. కానీ ప్ర­స్తు­తం ప్ర­తీ ఒక్క­రు స్వ­ఛ్ఛం­దం­గా బయ­ట­కు వచ్చి ఓటు వే­శా­రు.. ప్ర­జా­స్వా­మ్యం రుచి చూ­సా­రు.. ఒక్క రా­ష్ట్ర­మే కాదు.. పు­లి­వెం­దుల, ఒం­టి­మి­ట్ట కూడా కూ­ట­మి వైపు ఉన్నా­య­ని ఈ వి­జ­యం ద్వా­రా తె­లు­స్తుం­ది.. ఆరు వేల ఓట్ల­తో పు­లి­వెం­దుల జె­డ్పీ­టీ­సీ మె­జా­రి­టీ­తో కై­వ­సం చే­సు­కు­న్నాం.. కూ­ట­మి ప్ర­భు­త్వా­న్ని పు­లి­వెం­దుల ప్ర­జ­లు స్వా­గ­తం పలి­కా­రు.. వై­సీ­పీ­కి కనీ­సం డి­పా­జి­ట్ రా­లే­దు అని ఎద్దే­వా చే­సిం­ది. ప్ర­జా­స్వా­మ్యా­న్ని, అం­బే­ద్క­ర్ రా­జ్యాం­గా­న్ని నమ్ము­కు­న్న వారి ఎవరు నష్ట­పో­లే­దు.. రాజా రె­డ్డి రా­జ్యాం­గా­న్ని నమ్ము­కు­ని జగన్ మో­హ­న్ రె­డ్డి 151 సీ­ట్లు నుం­చి 11 సీ­ట్లు­కి పడి­పో­యా­ర­ని ఆరో­పిం­చారు.

సంక్షోభంలో వైఎస్ జగన్ భవిష్యత్తు

మాజీ సీఎం వై­ఎ­స్ జగన్ వ్య­వ­హర శైలి, అతి వి­శ్వా­సం ఆయ­న­కు ఒం­ట­రి­త­నా­న్ని తె­చ్చి­పె­ట్టిం­ది. బీ­జే­పీ­పై స్ప­ష్టత లే­క­పో­వ­డం, మి­త్ర­ప­క్షా­ల­తో స్నే­హం చే­య­డం ఫె­యి­ల్ అవ్వ­డం, బల­మైన పో­రా­టం చే­య­క­పో­వ­డం వంటి కా­ర­ణా­లు 2014, 2024లో ఓట­మి­కి కా­ర­ణా­లు. తా­జా­గా జరి­గిన పు­లి­వెం­దుల, ఒం­టి­మి­ట్ట ఎన్ని­క­లూ దా­ని­ని మరో­సా­రి ఫ్రూ­వ్ చే­శా­యి. ఇలా­నే సా­గి­తే ఆయన రా­జ­కీయ భవి­ష్య­త్తు సం­క్షో­భం­లో పడే అవ­కా­శ­ముం­ద­ని రా­జ­కీయ వి­శ్లే­ష­కు­లు హె­చ్చ­రి­స్తు­న్నా­రు.

Tags:    

Similar News