అనందయ్య కరోనా మందు పంపిణీకి హైకోర్టు గ్రీన్ సిగ్నల్..!

AP High Court : ఏపీలో అనందయ్య కరోనా మందు పంపిణీకి హైకోర్టు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ అంశంపై హైకోర్టులో వాడీవేడిగా వాదనలు జరిగాయి.

Update: 2021-05-31 13:15 GMT

AP High Court : ఏపీలో అనందయ్య కరోనా మందు పంపిణీకి హైకోర్టు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ అంశంపై హైకోర్టులో వాడీవేడిగా వాదనలు జరిగాయి. కంట్లో చుక్కల వల్ల కొన్ని ఇబ్బందులు తలెత్తాయని ప్రభుత్వం తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ఐ డ్రాప్స్ శాంపిల్స్ సేకరించి రెండు రోజుల్లో నివేదికను తమ ముందుంచాలని ధర్మాసనం ప్రభుత్వానికి సూచించింది. తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది. 4

అటు ఆనందయ్య కరోనా మందు తయారీకి సంబంధించి వనమూలికలను ప్రభుత్వమే సమకూర్చాలని న్యాయవాది యాలమంచిలి బాలాజీ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. మరో వైపు కంటి చుక్కల మందు వేసేందుకు ఆనందయ్య తరపు న్యాయవాది అశ్విన్ కుమార్ హైకోర్టు అనుమతి కోరారు. ఆయన వాదనలు విన్న ధర్మాసనం గురువారం నిర్ణయం తీసుకుంటామని చెప్పింది. ప్రభుత్వం రెండు రోజుల్లో నివేదిక ఇస్తుందేమో చూద్దాం అని హైకోర్టు చెప్పింది.

జిల్లా కలక్టర్, ఎస్పీ ఆనందయ్యను కలిసి మందు పంపిణీ నిర్ణయం తీసుకోవాలని సూచించింది. అటు ప్రభుత్వం మాత్రం కంటి చుక్కల మందుకు సంబంధించిన నివేదికకు రెండు వారాల సమయం కోరుతుంది. ప్రభుత్వ విజ్ఞప్తిని హైకోర్టు తోసిపుచ్చింది. గురువారం నాటికి రిపోర్టు తెప్పించుకోవాలని సూచించింది.


Full View


Tags:    

Similar News