AP High Court : ప్రతిపక్ష నేతగా జగన్!.. స్పీకర్ సెక్రటరీ, అసెంబ్లీ సెక్రటరీలకు హైకోర్టు నోటీసులు

Update: 2024-07-31 05:28 GMT

తనకు అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కల్పించాలని జగన్ ( YS Jagan ) దాఖలు చేసిన పిటిషన్ పై మంగళవారం ఏపీ హైకోర్టు విచారణ చేసింది. అసెంబ్లీ సెక్రటరీ, స్పీకర్ నోటీసులు జారీ చేసింది. నిబంధనల వివరాలను తమ ముందు ఉంచాలని హైకోర్టు తెలిపింది. తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది.

తనకు ప్రతిపక్ష హోదా కల్పించాలని వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ ఆ మధ్య పిటిషన్ దాఖలు చేశారు. రాజకీయ కక్షతోనే ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదని జగన్ తరఫున న్యాయవాదులు కోర్టులో వాదనలు వినిపించారు. జగన్ ను ప్రతిపక్ష నేతగా స్పీకర్ గుర్తించేలా చూడాలని కోర్టును కోరారు. ప్రతిపక్ష నేతగా గుర్తించాలని స్పీకర్కు వైఎస్ జగన్ వినతి ఇచ్చారా అని న్యాయమూర్తి ప్రశ్నించగా... గత నెల 24న ఇచ్చారని కోర్టుకు వైఎస్ జగన్ తరఫున న్యాయవాది తెలిపారు.

ఈ క్రమంలో దీనికి కౌంటర్ దాఖలు చేయాలని అసెంబ్లీ సెక్రటరీ, స్పీకర్ కు నోటీసులు జారీ చేసింది.

Tags:    

Similar News