AP High Court: రూ. 25వేల కోట్ల రుణాలు ఏమయ్యాయి.?: జగన్ ప్రభుత్వంపై హైకోర్టు ఫైర్..

AP High Court: జగన్ ప్రభుత్వం.. ఏపీ డెవెలప్‌మెంట్‌ కార్పోరేషన్ పేరుతో రుణాలు తీసుకోవడంపై హైకోర్టులో విచారణ జరిగింది.

Update: 2021-10-21 16:30 GMT

AP High Court (tv5news.in)

AP High Court: జగన్ ప్రభుత్వం.. ఏపీ డెవెలప్‌మెంట్‌ కార్పోరేషన్ పేరుతో రుణాలు తీసుకోవడంపై హైకోర్టులో విచారణ జరిగింది. ఏపీడీసీ పేరుతో రుణాలు తీసుకోవడంపై హైకోర్టులో మూడు ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం.. రాజ్యాంగ విరుద్ధంగా రూ. 25వేల కోట్ల రుణాలు తీసుకుందన్నారు పిటీషనర్ల తరుపు న్యాయవాది. ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన వారిలో విశాఖ తూర్పు టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ ఉన్నారు.

పిటిషనర్‌ తరుపు వాదనలు వినిపించారు న్యాయవాది యలమంజుల బాలాజీ. రాష్ట్ర ప్రభుత్వం.. ఆర్టికల్‌ 361, 266, 293 కు విరుద్దంగా రుణాలు తీసుకుందని తెలిపారు. అటు కేంద్రం సైతం .. ఇదే స్పష్టం చేసింది. రాజ్యాంగ విరుద్ధంగా రుణాలు తీసుకుందని తెలిపింది. దీంతో కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది హైకోర్టు.మరోవైపు పిటిషనర్లుగా రాజకీయ నేతలు ఉన్నారని ప్రభుత్వం తరుపు న్యాయవాది కోర్టులో వాదించారు.

ఈ వాదనలు విన్న హైకోర్టు రాజకీయ నేతలు పిటిషన్లు వేయోద్దని చెప్పలేమని స్పష్టం చేసింది. అంతే కాదు.. బ్యాంక్ గ్యారెంటీ అగ్రిమెంట్‌లో గవర్నర్‌ యొక్క సార్వభౌమ అధికారాన్ని వదులుకోవడం రాజ్యాంగ విరుద్దమని తెలిపింది. టాక్స్ రూపంలో వస్తున్న డబ్బులు రాష్ట్ర ఖజానాకు తరలిస్తున్నామని తెలిపారు ప్రభుత్వం తరపు న్యాయవాది. దీంతో రాష్ట్ర ఖజానాకు తరలిస్తున్న డబ్బుల ఒరిజినల్‌ రికార్డు కోర్టు ముందు ఉంచాలని ఆదేశించింది హైకోర్టు. తదుపరి విచారణ వచ్చే నెల 15కు వాయిదా వేసింది.

Tags:    

Similar News