మాజీ సీఎం చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణకు హైకోర్టులో ఊరట
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణపై దాఖలైన సీఐడీ కేసులో ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఏపీ హైకోర్టు మరోసారి ఆదేశించింది.;
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణపై దాఖలైన సీఐడీ కేసులో ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఏపీ హైకోర్టు మరోసారి ఆదేశించింది. మరో మూడు వారాల పాటు ఈ ఆదేశాలు అమలులో ఉండనున్నాయి. ఈ నెల 20 వ తేదీకి కేసు విచారణను వాయిదా వేసిన హైకోర్టు... కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ సీఐడీకి ఆదేశాలు జారీ చేసింది.