DSC : ఏపీ మెగా డీఎస్సీ ఫైనల్ సెలక్షన్ లిస్ట్ విడుదల..

Update: 2025-09-15 07:00 GMT

మెగా డీఎస్సీ అభ్యర్థులకు ఎట్టకేలకు శుభవార్త చెప్పింది ప్రభుత్వం. ఇందుకు సంబంధించిన ఫైనల్ సెలెక్షన్ లిస్ట్ ను రాష్ట్ర విద్యాశాఖ అధికారులు విడుదల చేశారు. ఈ జాబితాను జిల్లా విద్యాధికారి, కలెక్టర్ కార్యాలయాలతో పాటు మెగా డీఎస్సీ అధికారిక వెబ్‌సైట్ [https://apdsc.apcfss.in/ లో అందుబాటులో ఉంచారు.

ఈ ఏడాది ఏప్రిల్ 26 న డీఎస్సీ కి సంబంచిన ప్రకటన విడుదల కాగా...జూన్ 6 నుంచి జులై 2 వరకు రెండు విడతల్లో ఆన్‌లైన్ పరీక్షలు నిర్వహించింది ప్రభుత్వం. జులై 5న ప్రైమరీ కీ విడుదల చేశారు. అభ్యర్థుల నుంచి వచ్చిన అభ్యంతరాలను పరిశీలించి, ఆగస్టు 1న ఫైనల్ కీని విడుదల చేశారు. పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థుల సర్టిఫికేట్ల వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత, తాజాగా ఫైనల్ సెలక్షన్ లిస్ట్ విడుదల కావడంతో అభ్యర్థులు సంతోషం వ్యక్తం వేస్తున్నారు.

Tags:    

Similar News