ఆంధ్రప్రదేశ్ లో భిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. కొన్ని జిల్లాల్లో ఎండలు భగభగ మండుతుంటే.. మరి కొన్ని జిల్లాల్లో అకాల వర్షాలు దంచి కొడుతున్నాయి. మరో రెండు రోజులు రాష్ట్ర వ్యాప్తంగా భిన్నమైన వాతావరణ పరిస్థితులే ఉంటాయని వాతావారణ శాఖ అధికారులు తెలిపారు. వాతావరణ అధికారుల సూచనల ప్రకారం ఉపరితల ఆవర్తనం ప్రభావంతో గురు,శుక్రవారాల్లో ఉత్తరాంధ్ర జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, మిగిలిన జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. రేపు, ఎల్లుండి(ఏప్రిల్ 8, 9) అకస్మాత్తుగా పిడుగులతో కూడిన అవకాశం ఉందన్నారు. ఉరుములతో కూడిన వర్షం పడేపుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చెట్ల క్రింద నిలబడరాదని, రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వర్షం పడేటప్పుడు బయటకు వెళ్లవద్దని.. వెళ్లినా జాగ్రత్తలు పాటించాలని సూచించారు.