AP : ప్రధానికి సీఎం చంద్రబాబు చేసిన విజ్ఞప్తులు ఇవే!

Update: 2024-07-05 06:07 GMT

కేంద్రం పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనున్నందున రాష్ట్రానికి ఎక్కువ నిధులు కేటాయించాలని ప్రధాని మోదీకి ఏపీ సీఎం చంద్రబాబు ( N. Chandrababu Naidu ) విజ్ఞప్తి చేశారు. రాష్ట్రానికి ఆర్ధిక సాయంతో పాటు రాష్ట్ర పునర్నిర్మానానికి అవసరమైన సంపూర్ణ సహకారంపై చర్చించారు. గత ప్రభుత్వం విధ్వంసంతో రాష్ట్రం ఎదుర్కొంటున్న ఇబ్బందులను నివేదించారు.

గురువారం దాదాపు 40 నిమిషాల పాటు ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. రాబోయే ఐదేళ్లు ఏం చేయాలి, ఏం సాయం కావాలన్న అంశాలను వివరించారు. ఎన్డీఏలో కీలకంగా ఉండడంతో చంద్రబాబు విజ్ఞప్తులపై ప్రధాని సానుకూలంగా స్పందించారు. ఏం కావాలో చెప్పాలంటూ చంద్రబాబుకు మోదీ సూచించారు. ఈ నేపథ్యంలో రాజధాని, పోలవరం, కేంద్రం నిధులపై ప్రధానంగా విజ్ఞప్తి చేశారు.

కేంద్రమంత్రులు నితిన్ గడ్కరీ, పీయూష్ గోయల్లోనూ చంద్రబాబు చర్చలు జరిపారు. మొత్తం ఆరు అంశాలపై ప్రధాని మోదీకి ( Narendra Modi ) చంద్రబాబు నివేదిక ఇచ్చారు. అందులో రాజధాని అమరావతి నిర్మాణం, పోలవరం ప్రాజెక్ట్ వేగంగా పూర్తి, అనంత పురం-అమరావతి ఎక్స్ ప్రెస్ వే, రహదారులు లాంటి అంశాలపై చర్చించారు. శుక్రవారం నిర్మలా సీతారామన్ తో భేటీలోనూ నిధుల విడుదలపై చర్చించారు చంద్రబాబు.

Tags:    

Similar News