Army Jawan : స్ధలం కబ్జా .. తన భార్య, పిల్లలను కాపాడాలంటూ ఆర్మీజవాన్ ఆవేదన
Army Jawan : పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఆర్మీజవాన్ గోవింద్‌రెడ్డి ఇంటిస్థలాన్ని కొందరు ఆక్రమించారని ఆయన భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది.;
Army Jawan : పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఆర్మీజవాన్ గోవింద్‌రెడ్డి ఇంటిస్థలాన్ని కొందరు ఆక్రమించారని ఆయన భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనపై,తమ పిల్లలపై దాడిచేసి ఇంటి స్థలాన్ని కబ్జాచేశారంటూ ఆమె పోలీసులకు గోడు వెళ్లబోసుకుంది.
తన భార్యపిల్లలను కాపాడాలంటూ సరిహద్దుల్లో ఉన్న ఆర్మీ జవాన్ గోవిందరెడ్డి సెల్పీవీడియోలో వేడుకొన్నారు. తన ఇంటి స్థలాన్ని ఆక్రమించుకున్న వారికి ఓ మంత్రి, ఎమ్మెల్యే సహకారం ఉందని ఆయన ఆరోపించారు. కష్టపడి సంపాదించుకున్న స్థలాన్ని ఆక్రమించుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.