వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డికి ట్విట‌్టర్ లో మాజీ మంత్రి అయ్యన్నకౌంటర్ ఇచ్చారు. జ్వరం వస్తే పక్క రాష్ట్రానికి పారిపోయిన సంగతి మరిచిపోయారా.. మతిమరుపు వీసా రెడ్డి అంటూ ట్వీట్ చేశారు. 18 నుంచి 35 ఏళ్ల వయసుగల యువతలో ఫైర్ ఉంటుందని.. దాన్ని ఈ రాష్ట్ర ప్రగతి కోసం ఎలా వాడుకోవాలో తెలియదా అని ప్రశ్నించారు. వాలంటీర్ ఉద్యోగాలు, తోపుడుబళ్లు, జగనన్నసారాయి దుకాణాల్లో ఉద్యోగులుగా పెట్టి యువతను నిర్వీర్యం చేయడం దారుణమన్నారు. ఏపీ నుంచి గత 18 నెలల్లో వెళ్లిపోయిన కంపెనీల సంఖ్య 200 దాటిందని ఆరోపించారు.
గతంలో సీఎం చంద్రబాబు కృషితో ఎన్ని ఉద్యోగాలు వచ్చాయో.. ఎన్ని పెట్టుబడులు వచ్చాయో మీ మంత్రే అసెంబ్లీలో చెప్పారు చూడండి అని గుర్తు చేశారు. పెట్టుబడులు గురించి మీరు మాట్లాడడం ఏంటని ప్రశ్నించారు. వైజాగ్ లో పులివెందుల ముఠాను దించి.. ఎంతమంది పెట్టుబడు దారులను హింసిస్తున్నారో అందరికీ తెలుసన్నారు.
యువత సంగతి తరువాత,నీకు జ్వరం వస్తేనే పక్క రాష్ట్రానికి పారిపోయావ్ మార్చిపోయావా, మతిమరుపు @VSReddy_MP ?18 నుంచి 35 ఏళ్ళ వయసు గల యువతలో ఫైర్ ఉంటుంది. దాన్ని ఎలా ఈ రాష్ట్ర ప్రగతి కోసం ఎలా వాడుకోవాలో తెలియకుండా, వాలంటీర్ ఉద్యోగాలు,తోపుడు బళ్ళు,(1/3) pic.twitter.com/xTvXm3jHyw
— Ayyanna Patrudu (@AyyannaPatruduC) December 14, 2020