కరోనా మృతుల కుటుంబాలను ఆదుకోవడంలో జగన్ విఫలం : అయ్యన్నపాత్రుడు
టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఆ పార్టీ నేతలు సాధన దీక్షలు చేపడుతున్నారు.;
టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఆ పార్టీ నేతలు సాధన దీక్షలు చేపడుతున్నారు.. 175 నియోజకవర్గాల్లో సాధన దీక్షలు కొనసాగుతున్నాయి.. విశాఖలో మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు అయ్యన్న పాత్రుడు దీక్ష చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వ తీరుపై నిప్పులు చెరిగారు.. రాష్ట్ర వ్యాప్తంగా కరోనాతో లక్షా 12 వేల మందికి పైగా మరణిస్తే ప్రభుత్వం తప్పుడు లెక్కలు చూపిస్తోందని అయ్యన్న పాత్రుడు మండిపడ్డారు. సీఎం జగన్‌కు, మంత్రులకు అక్రమ కేసుల పెట్టడంపై ఉన్న శ్రద్ధ.. ప్రజల ప్రాణాల పట్ల లేదన్నారు. తమిళనాడు సీఎం స్టాలిన్‌ను చూసైనా జగన్ బుద్ధి తెచ్చుకోవాలని హితవు పలికారు. కరోనా మృతుల దహన సంస్కారాలకు 15 వేల రూపాయలు ఇస్తామన్న సీఎం జగన్.. ఎంత మందికి ఇచ్చారో చెప్పాలని నిలదీశారు. ప్రజలు ప్రశ్నించే సమయం వచ్చిందని.. జగన్ మెడలు వంచి గాడిలో పెట్టాలన్నారు అయ్యన్నపాత్రుడు.