Minister Kollu Ravindra : ఏపీ వ్యాప్తంగా బీసీ కృతజ్ఞతా ర్యాలీలు - మంత్రి కొల్లు రవీంద్ర

Update: 2025-08-09 17:15 GMT

ఇవాళ్టి నుంచి 4 రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా బీసీల కృతజ్ఞతా ర్యాలీలు నిర్వహిస్తున్నట్లు మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. బీసీలకు చేసిన సంక్షేమంపై చంద్రబాబు ఫొటోలకు క్షీరాభిషేకాలు చేస్తామని చెప్పారు. కుల సంఘాల ఆధ్వర్యంలో సీఎంకు కృతజ్ఞతలు చెప్తామన్నారు. శని, ఆదివారాల్లో కల్లు గీత కార్మికులతో కృతజ్ఞత సమావేశాలు ఉంటాయని వివరించారు. ఈ నెల 11న చేనేత కార్మికుల ఆధ్వర్యంలో 100 అడుగుల వస్త్రాలతో ర్యాలీలు నిర్వహిస్తామన్నారు. బీసీలకు మొదటి నుంచి గుర్తింపు ఇచ్చింది టీడీపీ మాత్రమే అని.. బీసీల సంక్షేమానికి ఎన్నో పథకాలు తెచ్చినట్లు తెలిపారు. బీసీ నేతలపై అక్రమ కేసులు పెట్టి జైల్లోకి పంపించిన చరిత్ర వైసీపీది అని మండపడ్డారు.

Tags:    

Similar News