Bhogapuram : భోగాపురం.. ఏపీ పర్యాటకానికి చాలా ముఖ్యం : సీఎం బాబు

Update: 2024-07-12 07:06 GMT

భవిష్యత్ లో పెద్దఎత్తున అభివృద్ధి చెందబోయే నగరం భోగాపురం అని చెప్పారు ఏపీ సీఎం చంద్రబాబు. ఈ ఎయిర్ పోర్టుతో విశాఖపట్నం, విజయ నగరం కలిసిపోతుందనీ. ఇక్కడ నుంచి శ్రీకాకుళం కూడా కలిసే అవకాశం ఉందని చెప్పారు. శ్రీకాకుళం 50 కిలోమీటర్లు, విశాఖపట్నం 50 కిలోమీటర్లు.. ఆ సెంటర్ లో ఈ ఎయిర్ పోర్టు వస్తోందన్నారు. గురువారం ఆయన భోగాపురం విమానాశ్రయం పనులను పరిశీలించారు.

"ఫేజ్-1లో భోగాపురం వరకు బీచ్ రోడ్డు, ఫేజ్-2లో ఇంకో 50 కిలోమీటర్లు శ్రీకాకుళం, ఫేజ్-3లో మూలపేట పోర్టు వరకు రోడ్డు నిర్మాణం జరుగుతుంది. దీంతో మూలపేట నుంచి సమాంతర హైవే, బీచ్ రోడ్డు ఇప్పుడున్న హైవేకు అనుసంధానమైతే, మధ్యలో కొన్ని కనెక్టివీలు పెట్టుకుంటే పారిశ్రామికాభివృద్ధికి ఇదొక అద్భుత నగరంగా మారుతుంది. మరే నగరం, ప్రాంతం కూడా దీనికి తలదన్నేలా ఉండవు. ఎప్పట్నుంచో చెబుతున్నా.. ఇదే నా కల. దానిని ఇప్పుడు సాకారం చేసుకునే పరిస్థితి వచ్చింది" చంద్రబాబు నాయుడు వెల్లడించారు.

Tags:    

Similar News