AP : బీజేపీ, జనసేన, వైసీపీ డిష్యూం డిష్యూం

Update: 2024-04-04 06:17 GMT

ఆంధ్రప్రదేశ్‌లోని (AP) కాకినాడ జిల్లాలో బిజెపి, జనసేన పార్టీ, వైఎస్‌ఆర్‌సిపి కార్యకర్తల మధ్య బుధవారం ఘర్షణ జరిగినట్లు పోలీసులు తెలిపారు. సర్పవరం పోలీసు స్టేషన్‌ పరిధిలో ఒకరిపై ఒకరు దాడికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. ఎన్నికల తాయిలాల పంపకం నేపథ్యంలో ఈ గలాటా జరిగినట్టు చెబుతున్నారు.

కాకినాడ ఆర్టీఓ కార్యాలయం సమీపంలోని శశికాంత్ నగర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఉచిత వస్తువులు దాచారని బీజేపీ ఆరోపించడంతో బీజేపీ, జనసేన కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. బీజేపీ, వైఎస్సార్‌సీపీ మద్దతుదారుల మధ్య ఘర్షణ కూడా జరిగిందని పోలీసులు తెలిపారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘనలకు పాల్పడలేదని, శాంతిభద్రతలకు సంబంధించిన సమస్యలు మాత్రమే ఉన్నాయని స్థానిక ఇన్‌స్పెక్టర్ తెలిపారు. తాము కార్యకర్తలను చెదరగొట్టామని, కేసు నమోదు చేసి విచారణ చేపడతామని తెలిపారు.

ఆంధ్రప్రదేశ్‌లో పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరుగుతున్నాయి. మే 13న ఓటింగ్, జూన్ 4న ఓట్ల లెక్కింపు చేస్తారు. ప్రచారానికి ఊపు రావడంతో ఈసీ ఆదేశాలతో అంతటా పోలీసులు అలర్ట్ అయ్యారు.

Tags:    

Similar News