BRAHMANI: చంద్రబాబు అడిగినా రాజకీయాల్లోకి రాను
రాజకీయ ప్రవేశంపై స్పష్టత ఇచ్చిన నారా వారి కోడలు
రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన తనకు లేదని మంత్రి నారా లోకేశ్ సతీమణి, హెరిటేజ్ ఫుడ్స్ నారా బ్రాహ్మణి వెల్లడించారు. 'మోస్ట్ పవర్‌ఫుల్ విమెన్ 2025' కార్యక్రమంలో బ్రాహ్మణిని నిర్వాహకులు ఓ ప్రశ్న వేశారు. ఒకవేళ చంద్రబాబు మిమ్మల్ని రాజకీయాల్లోకి రావాలని కోరితే ఏమంటారు అని అడిగారు. దీనికి బ్రాహ్మణి స్పందిస్తూ రాజకీయాలు నాకు ఆసక్తికరమైన రంగం కాదని స్పష్టం చేశారు. "ఒకవేళ చంద్రబాబు మిమ్మల్ని రాజకీయాల్లోకి రావాలని కోరితే ఏమంటారు?" అని నిర్వాహకులు ప్రశ్నించారు. దీనికి ఆమె స్పందిస్తూ.. "రాజకీయాలు నాకు ఆసక్తికరమైన రంగం కాదు" అని స్పష్టంగా సమాధానమిచ్చారు. "పాడిరంగంలోని లక్షల మంది మహిళా రైతులు, కోట్ల మంది వినియోగదారులపై ప్రభావం చూపగలిగే అవకాశాన్ని ఎందుకు వదులుకోవాలి?" అని ఆమె ప్రశ్నించారు. తనకు వ్యక్తిగతంగా ఆరోగ్యం, పోషణ రంగాలపై చిన్నప్పటి నుంచే ఎంతో ఆసక్తి ఉందని, ప్రస్తుతం ఆ రంగంలోనే పనిచేయడం సంతృప్తినిస్తోందని బ్రాహ్మణి వివరించారు. ఈ వ్యాఖ్యలతో తన రాజకీయ ప్రవేశంపై వస్తున్న ఊహాగానాలకు ఆమె తెరదించారు.