AP : ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డిపై కేసు నమోదు

Update: 2024-07-03 05:39 GMT

సాయిబాబా పాఠశాలల ఛైర్మన్, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డిపై కేసు నమోదైంది. కడప జిల్లా అక్కాయపల్లిలోని సాయిబాబా పాఠశాలలో పైకప్పు పెచ్చులూడి మీద పడటంతో ఆరుగురు విద్యార్థులకు గాయాలయ్యాయి. దీంతో వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. యజమాన్యం నిర్లక్ష్యం వల్లే పైకప్పు కూలిందని పోలీసులు ఎమ్మెల్సీపై కేసు నమోదు చేశారు. కడప నగరంలోని ఐటీఐ కూడలి సమీపంలో వైసీపీ ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డికి చెందిన సాయిబాబా పాఠశాలలో మంగళవారం తరగతి గది పైకప్పు పెచ్చులూడిన ప్రమాదంలో 8వ తరగతి చదువుతున్న ఆరుగురు విద్యార్థులు గాయపడ్డారు. వీరిలో ఓ విద్యార్థి తలకు తీవ్ర గాయం కాగా, మరో విద్యార్థికి చేయి విరిగింది.

Tags:    

Similar News