CBI Court : జగన్ బెయిల్ రద్దు పిటిషన్ పై సీబీఐ కోర్టు కీలక వ్యాఖ్యలు..!

CBI Court : ఏపీ సీఎం జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ ఎంపీ రఘురామకృష్ణంరాజు దాఖలు చేసిన పిటిషన్ విచారణ సందర్భంగా సీబీఐ కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

Update: 2021-05-26 09:24 GMT

CBI Court ; ఏపీ సీఎం జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ ఎంపీ రఘురామకృష్ణంరాజు దాఖలు చేసిన పిటిషన్ విచారణ సందర్భంగా సీబీఐ కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కౌంటర్ దాఖలుకు చివరి అవకాశం ఇస్తున్నామని స్పష్టం చేసింది. కౌంటర్ దాఖలు చేయకపోతే పిటిషన్ ను నేరుగా విచారిస్తామని తేల్చి చెప్పింది. విచారణను జూన్ 1కి వాయిదా వేసింది. జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ రఘురామ దాఖలు చేసిన పిటిషన్ పై సీబీఐ కోర్టు విచారణ జరిపింది.

విచారణ సందర్భంగా కౌంటర్ దాఖలుకు సీఎం జగన్ సీబీఐ తరఫు లాయర్లు మరింత గడువు కోరారు. లాక్ డౌన్ తో సహా వివిధ కారణాల వల్ల కౌంటర్ దాఖలు చేయలేదన్న జగన్ తరఫు లాయర్లు చెప్పారు. సీబీఐ నుంచి ఇంకా సూచనలు రాలేదని, దర్యాప్తు సంస్థ తరపు న్యాయవాదులు చెప్పారు. ప్రతివాదులకు జరిమానా విధించాలని రఘురామ తరఫు న్యాయవాది కోర్టును కోరారు. జూన్ 1న కౌంటర్ దాఖలు చేయకపోతే నేరుగా విచారణ చేపడతామని సీబీఐ కోర్టు స్పష్టం చేసింది.


Full View


Tags:    

Similar News