CBN: ప్రపంచం మొత్తం భారత్‌వైపే చూస్తోంది: చంద్రబాబు

రేమాండ్‌ ప్రాజెక్టుకు సీఎం శంకుస్థాపన

Update: 2025-11-16 05:30 GMT

వి­శాఖ అం­ద­మైన నగ­ర­మ­ని.. దీ­ని­తో ఏ నగ­రా­న్ని పో­ల్చ­లే­మ­ని సీఎం చం­ద్ర­బా­బు అన్నా­రు. వి­శా­ఖ­లో రెం­డో రోజు జరు­గు­తు­న్న సీఐఐ సద­స్సు­లో ఆయన మా­ట్లా­డా­రు. ‘‘రెం­డు రో­జుల సద­స్సు­లో అనేక సం­స్థ­లు పె­ట్టు­బ­డు­ల­కు ముం­దు­కు­వ­చ్చా­యి. 3 వేల మంది ప్ర­తి­ని­ధు­లు ఈ సద­స్సు­కు రా­వ­డం హర్ష­ణీ­యం. 1991లో ఆర్థిక సం­స్క­ర­ణ­లు ప్రా­రం­భ­మ­య్యా­యి. ఉమ్మ­డి ఏపీ­లో వి­ద్యు­త్‌ సం­స్క­ర­ణ­లు తీ­సు­కు­వ­చ్చి వి­ని­యో­గా­న్ని పెం­చ­గ­లి­గాం. ఏఐ వి­ని­యో­గం ద్వా­రా వి­ద్యు­త్‌ పం­పి­ణీ నష్టా­లు, సర­ఫ­రా వ్య­యం తగ్గిం­చా­లి. సాం­కే­తి­క­త­లో కొ­త్త ఆవి­ష్క­ర­ణ­ల­కు కొ­ద­వ­లే­దు. నై­పు­ణ్యం ఉన్న యు­వ­త­కు ఎలాం­టి కొరత లేదు. ఒక వి­జ­న్‌­తో ముం­దు­కె­ళ్ల­డం వల్ల సత్ఫ­లి­తా­లు వస్తు­న్నా­యి. ప్ర­పం­చం మొ­త్తం భా­ర­త్‌ వైపే చూ­స్తోం­ది. భా­ర­త్‌­లో సమ­ర్థ నా­య­క­త్వం ఉంది’’ అని చం­ద్ర­బా­బు అన్నా­రు. ఏపీ ఇప్పు­డు అభి­వృ­ద్ధి పథం­లో దూ­సు­కు­పో­తోం­ద­ని అన్నా­రు.

రేమాండ్‌ ప్రాజెక్టుకు సీఎం శంకుస్థాపన

వి­శాఖ వే­ది­క­గా జరు­గు­తో­న్న 30వ సీఐఐ భా­గ­స్వా­మ్య సద­స్సు­లో రెం­డో రోజు రే­మాం­డ్ గ్రూ­ప్ ప్రా­జె­క్టు­ల­కు సీఎం చం­ద్ర­బా­బు వర్చు­వ­ల్‌­గా శం­కు­స్థా­పన చే­శా­రు. అనం­త­పు­రం జి­ల్లా­లో రూ.1201 కో­ట్ల పె­ట్టు­బ­డు­ల­తో మూడు వే­ర్వే­రు పరి­శ్ర­మ­లు ఏర్పా­టు అవు­తు­న్నా­య­ని, ద్వా­రా 6500 మం­ది­కి ప్ర­త్య­క్షం­గా ఉద్యో­గా­లు వస్తా­య­ని సీఎం చం­ద్ర­బా­బు ఈ సం­ద­ర్భం­గా పే­ర్కొ­న్నా­రు. ఈ శం­కు­స్థా­పన కా­ర్య­క్ర­మా­ని­కి రే­మాం­డ్ గ్రూ­ప్ మే­నే­జిం­గ్ డై­రె­క్ట­ర్ గౌ­త­మ్ మైనీ, ఆ సం­స్థ కా­ర్పో­రే­ట్ డె­వ­ల­ప్మెం­ట్ హెడ్ జతి­న్ ఖన్నా, మం­త్రి టీజీ భరత్ హా­జ­ర­య్యా­రు.. రూ.1201 కో­ట్ల పె­ట్టు­బ­డు­ల­తో రా­ష్ట్రం­లో మూడు ప్రా­జె­క్టు­లు రే­మం­డ్ గ్రూ­ప్ ఏర్పా­టు చే­య­నుం­ది. సి­ల్వ­ర్ స్పా­ర్క్ అప్పా­రె­ల్, జేకే మైనీ గ్లో­బ­ల్ ఏరో­స్పే­స్ లి­మి­టె­డ్, జేకే మైనీ గ్లో­బ­ల్ ప్రె­సి­ష­న్ లి­మి­టె­డ్ యూ­ని­ట్ల­కు సీఎం చం­ద్ర­బా­బు చే­తుల మీ­దు­గా ఈ రోజు శం­కు­స్థా­పన చే­శా­రు.. అనం­త­పు­రంలో­ని రా­ప్తా­డు­లో రూ.497 కో­ట్ల వ్య­యం­తో సి­ల్వ­ర్ స్పా­ర్క్ అప్పా­రె­ల్ మా­న్యు­ఫా­క్చ­రిం­గ్ పా­ర్క్ ను ఏర్పా­టు చే­య­నుం­ది.

లులుతో ఏపీ ప్రభుత్వం ఎంవోయు

ఏపీ­లో లులు ఎం­ట్రీ ఖా­య­మైం­ది. రా­ష్ట్రం­లో పలు ప్రా­జె­క్టుల కోసం లులు ఇం­ట­ర్నే­ష­న­ల్ గ్రూ­ప్ సం­స్థ ప్ర­భు­త్వం­తో ఒప్పం­దం చే­సు­కుం­ది. వి­శాఖ వే­ది­క­గా మల్ల­వె­ల్లి ఫుడ్ ప్రా­సె­సిం­గ్ యూ­ని­ట్‌­పై ఎం­వో­యూ కు­రు­ద్చు­కుం­ది. రా­ష్ట్ర ప్ర­భు­త్వ అధి­కా­రు­లు, లులు సం­స్థ ప్ర­తి­ని­ధు­లు అం­గీ­కార పత్రా­లు మా­ర్చు­కు­న్నా­రు. అయి­తే, ఇటీ­వల జరి­గిన కే­బి­నె­ట్‌­లో లులు పె­డు­తు­న్న షర­తు­ల­పై డి­ప్యూ­టీ సీఎం పవన్ కల్యా­ణ్ అభ్యం­త­రం తె­ల­ప­డం గమ­నా­ర్హం. భాగస్వామ్య సదస్సులో ఏపీకి భారీ పెట్టుబడులు వచ్చాయి.

Tags:    

Similar News