Chandrababu Deeksha : మొదలైన చంద్రబాబు దీక్ష.. వైసీపీ కార్యకర్తలు సృష్టించిన విధ్వంసం మధ్యే దీక్షా వేదిక

Chandrababu Deeksha : టీడీపీ అధినేత చంద్రబాబు 36 గంటల దీక్ష కొనసాగుతోంది. టీడీపీ కార్యాలయాలపై దాడికి నిరసనగా చంద్రబాబు దీక్ష చేపట్టారు.

Update: 2021-10-21 04:03 GMT

Chandrababu Deeksha : టీడీపీ అధినేత చంద్రబాబు 36 గంటల దీక్ష కొనసాగుతోంది. టీడీపీ కార్యాలయాలపై దాడికి నిరసనగా చంద్రబాబు దీక్ష చేపట్టారు. ప్రభుత్వ ఉగ్రవాదంపై పోరు పేరుతో దీక్ష కొనసాగిస్తున్నారు. దీక్షా వేదికను కూడా వైసీపీ కార్యకర్తలు సృష్టించిన విధ్వంసం మధ్యే ఏర్పాటు చేసుకున్నారు. దీక్షలో మాట్లాడిన చంద్రబాబు.. ప్రభుత్వంపైనా, పోలీసుల పైనా విరుచుకుపడ్డారు. పోలీసులకు చేతకాకపోతే ఇంటికెళ్లిపోవాలని, తమ రక్షణను తామే చూసు

ముందుగా ఎన్టీఆర్‌కు నివాళులు అర్పించి దీక్షలో కూర్చున్నారు చంద్రబాబు. సరిగ్గా ఉదయం 8 గంటలకు దీక్షలో కూర్చోవాల్సి ఉండగా.. 20 నిమిషాలు ఆలస్యం అయింది. చంద్రబాబు వస్తున్న సమయంలోనే జగన్‌ కూడా వెళ్తుండడంతో.. కాన్వాయ్‌ రూట్‌ మార్చారు. పార్టీ కేంద్ర కార్యాలయానికి తాడేపల్లి వైపు కాకుండా మంగళగిరి మీదుగా చంద్రబాబు కాన్వాయ్ మళ్లించారు. దీంతో 20 నిమిషాలు ఆలస్యంగా దీక్షాస్థలికి చేరుకున్నారు చంద్రబాబు.

చంద్రబాబు దీక్షకు పోలీసులు అడ్డంకులు సృష్టిస్తున్నారు. చంద్రబాబు చేపడుతున్న నిరసన దీక్షకు మద్దతుగా జిల్లాల నుంచి నేతలు, కార్యకర్తలు తరలివస్తున్నారు. అయితే, వీరిని పార్టీ కేంద్ర కార్యాలయానికి వెళ్లనివ్వకుండా అడ్డుకుంటున్నారు పోలీసులు. బారీకేడ్లు అడ్డుపెట్టి పార్టీ కార్యాలయానికి వెళ్లే రోడ్లను బ్లాక్‌ చేశారు. పార్టీ కార్యాలయానికి వెళ్లడానికి అనుమతిలేదంటూ పోలీసులు చెబుతున్నారు. దీక్షకు అనుమతి ఇచ్చిన పోలీసులే.. పార్టీ ఆఫీసుకి వెళ్లడానికి అనుమతి లేదని చెప్పడంపై టీడీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

చంద్రబాబు దీక్షకు మద్దతుగా అన్ని జిల్లాల నుంచి నేతలు తరలివస్తున్నారు. ఇప్పటికే చంద్రబాబుతో పాటు అచ్చెన్నాయుడు, యనమల, టీడీ జనార్ధన్, కొల్లు రవీంద్ర, వర్ల రామయ్య దీక్షలో కూర్చున్నారు. అయితే జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో నేతలు, కార్యకర్తలు వస్తుండడంతో.. పార్టీ కార్యాలయం వరకు పోలీసులు అనిమతించడం లేదు.

Tags:    

Similar News