HBD Chandrababu: చంద్రబాబు బర్త్‌డే.. లోకేష్ స్పెషల్ విషెస్..
HBD Chandrababu: తెలుగు వారికి చంద్రబాబు అంటే ఒక భరోసా అన్నారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్.;
HBD Chandrababu: తెలుగు వారికి చంద్రబాబు అంటే ఒక భరోసా అన్నారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్. పుట్టినరోజు సందర్భంగా నాన్నకు శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశారు. లక్షల ఉద్యోగాలిచ్చి కోట్ల మందికి అన్నదాత అయ్యారన్నారు. లక్షలాది తెలుగుదేశం సైనికులకు ఆయనే ఒక ధైర్యమని పేర్కొన్నారు. సొంత కుటుంబం కాకుండా.. తెలుగు జాతినే కుటుంబం చేసుకున్నారన్నారు. ఆ కుటుంబం కోసం ఎన్నో త్యాగాలు చేసిన ఆయనే తన సూపర్ స్టార్ అంటూ ట్వీట్ చేశారు లోకేష్.
ఇక తెలుగువారికి ఆయనంటే ఒక భరోసా.లక్షలాది తెలుగుదేశం సైనికులకు ఆయనే ఒక ధైర్యం. ఈ రకంగా కోట్లాది మందికి తండ్రి అయ్యారు ఆయన. సొంత కుటుంబం కోసం కాకుండా, తెలుగు జాతినే కుటుంబం చేసుకుని, ఆ కుటుంబం కోసం ఎన్నో త్యాగాలు చేసిన ఆయనే నా సూపర్ స్టార్... ఆయనే మా నాన్న చంద్రబాబు గారు.(2/3)
— Lokesh Nara (@naralokesh) April 20, 2022
జన్మనిచ్చేవారే కాకుండా చదువు చెప్పేవారు, అన్నం పెట్టిన వారు, భయాన్ని పోగొట్టేవారు కూడా తండ్రితో సమానం అని చాణక్యుడు చెప్పాడు. ఆ ప్రకారంగా చూస్తే ఆయన దార్శనిక పాలన ద్వారా ఎంతో మంది పేదలు కూడా ఉన్నత చదువులు చదవగలిగారు. లక్షల ఉద్యోగాలిచ్చి కోట్లాదిమందికి అన్నదాత అయ్యారు.(1/3) pic.twitter.com/CbWuAAmPhe
— Lokesh Nara (@naralokesh) April 20, 2022