AP CM : సాగునీటి ప్రాజెక్టులకు అంకురార్పణ చేసిందే చంద్రబాబు : సీఎం చంద్రబాబు

Update: 2025-08-02 07:30 GMT

సాగునీటి ప్రాజెక్టులకు అంకురార్పణ చేసిన ఘనత సీఎం చంద్రబాబు నాయుడుకి దక్కుతుందన్నారు ప్రభుత్వ విప్ రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు. మాజీమంత్రి హరీష్ రావు ఏపీ సీఎం చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని మార్కెట్ యార్డులో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఆయన హరీష్ రావు పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు పై చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని వ్యాఖ్యానించారు. ప్రజా సంక్షేమమే చంద్రబాబు నాయుడు లక్ష్మన్నారు. తెలంగాణ నగర ఆర్థిక రాజధాని అభివృద్ధికి ప్రధాన కారకుడు చంద్రబాబు నాయుడన్నారు, తెలంగాణ అభివృద్ధి ప్రారంభమైంది టిడిపి ఆవిర్భావం నుండే జరిగిందన్నారు.దొరల తెలంగాణను... ప్రజల తెలంగాణ గా మార్చిన ఘనత చంద్రబాబు నాయుడుకే దక్కుతుందన్నారు. రెండు రాష్ట్రాల శ్రేయస్సే చంద్రబాబు లక్ష్యం అన్నారు. తెలంగాణ నేత హరీష్ రావు బెనకచర్ల జలాలపై చేసిన వ్యాఖ్యలను తక్షణం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు లోపాయికర్ ఒప్పందం చేసుకున్నారని విమర్శించడం తగదన్నారు. బిఆర్ఎస్, టీఆర్ఎస్ సృష్టికర్త కెసిఆర్ కూడా చంద్రబాబు నాయుడు శిష్యుడు అన్న విషయాన్ని మరిచారని మండిపడ్డారు. స్వార్థ రాజకీయాల కోసం హరీష్ రావు దిగజారడం తగదని వ్యాఖ్యానించారు.బెనకచర్ల మిగులు జలాలు గోదావరికి తరలిస్తే రాయలసీమ సస్యశ్యామలం అవుతుందన్నారు. సాగునీటి ప్రాజెక్టులకు అంకురార్పణ చేసిందే చంద్రబాబు నాయుడు అన్నారు.

Tags:    

Similar News