ప్రజలపై విద్యుత్ భారం తగ్గించిన చంద్రబాబు..!

Update: 2026-01-02 04:59 GMT

సీఎం చంద్రబాబు నాయుడు ఏపీని అన్ని రకాలుగా అభివృద్ధి చేయడానికి ఎన్నో కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు. గత వైసీపీ ప్రభుత్వం ప్రజల మీద మోపిన భారాలను కూడా ఒక్కొక్కటిగా తగ్గిస్తూ వస్తున్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వ హయాంలో మరో భారీ గుడ్ న్యూస్ చెప్పారు ఏపీ ప్రజలకు. అదేంటంటే విద్యుత్ సంస్థలకు చెల్లించాల్సిన 4497 కోట్ల ట్రూఅప్ భారాన్ని ప్రభుత్వమే భరిస్తుందని చంద్రబాబు నాయుడు తెలిపారు. దాన్ని ప్రజల మీద మోపొద్దంటూ చెప్పారు. దీంతో ప్రజలకు ఈ భారం తప్పింది. గత వైసీపీ ప్రభుత్వం మాత్రం ఇష్టం వచ్చినట్టు రకరకాల పేర్లతో ప్రజల మీద భారాన్ని మోపింది. ఇప్పటికీ కరెంట్ బిల్లులు ఎక్కువగా కడుతూ వస్తున్నారు ఏపీ ప్రజలు. కానీ సీఎం చంద్రబాబు మాత్రం అలా కాదు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడే ఆయన ఓ మాట అన్నారు. ఇక నుంచి ఏపీలో ఇష్టానుసారంగా కరెంట్ బిల్లులు పెంచేది ఉండదని తెలిపారు. అంతే కాకుండా ప్రజల మీద చాలా వరకు జగన్ వేసిన భారాలను తగ్గిస్తూ వస్తున్నారు. రీసెంట్ గా డిస్కమ్ కంపెనీలు ప్రజల నుంచి రకరకాల ఛార్జీలను వసూలు చేయాల్సి ఉంటుందని ప్రభుత్వం ముందు అర్జీలు పెట్టారు. కానీ వాటికి ప్రభుత్వం ఒప్పుకోలేదు. ఎట్టి పరిస్థితుల్లో ప్రజల మీద భారం వేయొద్దని.. వాటన్నింటినీ ప్రభుత్వమే చెల్లిస్తుందని సీఎం చంద్రబాబు ప్రకటించారు.

నిజంగా చిత్తశుద్ధి ఉన్న నాయకుడే ఇలా చేస్తారు కదా. కానీ జగన్ కు అలాంటివి ఏమీ ఉండవు. ఇష్టానుసారంగా బిల్లులు పెంచేసి ప్రజల మీద భారం మోపడం మాత్రమే జగన్ కు తెలుసు. కానీ ఇప్పటి వరకు ఒక్కసారి కూడా జగన్ హయాంలో ప్రజల మీద భారాన్ని తగ్గించలేదు. కానీ చంద్రబాబు మాత్రం రాబోయే రోజుల్లో ప్రతి ఇంటికీ సోలార్ కనెక్టెవిటీ ఉండాలని చెబుతున్నారు. ప్రజల మీద కరెంట్ ఛార్జీలు పూర్తిగా తగ్గాలన్నదే తన లక్ష్యం అంటూ వివరిస్తున్నారు.

Tags:    

Similar News