రేపు నా పుట్టిన రోజు వేడుకలు నిర్వహించవద్దు.. కార్యకర్తలకు చంద్రబాబు పిలుపు
తన పుట్టిన రోజు వేడుకలను జరపోద్దని టీడీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కార్యకర్తలకు, నాయకులకు పిలుపు నిచ్చారు.;
తన పుట్టిన రోజు వేడుకలను జరపోద్దని టీడీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కార్యకర్తలకు, నాయకులకు పిలుపు నిచ్చారు. కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఇప్పుడు వేడుకలకంటే భద్రత ఎంతో ముఖ్యమని చంద్రబాబు స్పష్టం చేశారు. తోటి కార్యకర్తలను రక్షించుకుంటూ చుట్టూ ఉన్నవారిని జాగ్రత్తగా చూసుకోవాలన్నారు. ఇదే మీరు నాకిచ్చే బర్త్‌డే బహుమతి అన్నారు చంద్రబాబు. దేశంలో కరోనా తీవ్రంగా విస్తరిస్తోందని ఇలాంటి సమయంలో మనల్ని మనమే రక్షించుకోవాలన్నారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ కరోనా వైరస్ నుంచి రక్షణ పొందాలన్నారు.