ఏపీలో పెట్టుబడులే లక్ష్యంగా సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రపంచమంతా చుట్టేసి అన్ని కంపెనీలను కలుస్తున్నారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు వారిని ఆహ్వానిస్తున్నారు. ఇందులో భాగంగానే సీఎం చంద్రబాబు నాయుడు నేడు దుబాయ్ కు వెళ్లారు. దుబాయ్ లోని భారత రాయబారి కార్యాయలంలో భేటీ కానున్నారు. మూడు రోజుల పాటు 29 ఈవెంట్లలో దుబాయ్ లో సీఎం చంద్రబాబు పాల్గొంటారు. నవంబర్ 14, 15 తేదీల్లో విశాఖలో సీఐఐ సమ్మిట్ నిర్వహిస్తోంది. ఈ సమ్మిట్ లో పాల్గొనేందుకు పారిశ్రామిక వేత్తలను ఆహ్వానించబోతున్నారు సీఎం చంద్రబాబు నాయుడు. అటు నారా లోకేష్ కూడా ఆస్ట్రేలియాలో పర్యటిస్తూ ప్రముఖ కంపెనీలను ఏపీకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే ఈ సీఐఐ సమ్మిట్ కు రావాల్సిందిగా సదరు కంపెనీలను ఆహ్వానిస్తున్నారు లోకేష్. ఇటు సీఎం చంద్రబాబు కూడా దుబాయ్ లో వరుసగా ఈవెంట్లు ప్లాన్ చేసుకుని బిజినెస్ పర్సన్లతో కాన్ఫరెన్స్ నిర్వహించబోతున్నారు.
ఏపీ ప్రభుత్వం కంపెనీలకు కల్పిస్తున్న రాయితీలు, ఇక్కడ ఉన్న ఫెసిలిటీలు, భౌగోలిక పరిస్థితులు, సముద్ర తీరం లాంటి అడ్వాంటేజెస్ ను కూలంకుశంగా వివరించనున్నారు. అలా వివరించి అన్ని కంపెనీలను ఏపీ సమ్మిట్ లో పాల్గొనేలా చేయబోతున్నారు. ఇక సీఐఐ సమ్మిట్ ప్రధాన ఉద్దేశం ఏపీలో పెట్టుబడుల కోసం ప్రముఖ కంపెనీలను ఆహ్వానించడమే. ప్రపంచ స్థాయి కంపెనీలతో ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఎంవోయూలు కుదుర్చుకునే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ఆల్రెడీ విశాఖకు గూగుల్ డేటా సెంటర్ రావడం అతిపెద్ద ప్లస్ పాయింట్. కాబట్టి దుబాయ్ ప్రోగ్రామ్ లలో గూగుల్ పెట్టబడులతో పాటు టీసీఎస్, క్వాంటమ్ పెట్టుబడులను వివరించబోతున్నారు.
మెటా సి కేబుల్ ప్రాజెక్టును వివరించనున్నారు. విశాఖ ఐటీ ఎకో సిస్టమ్ గా ఎలా డెవలప్ అవుతోందనేది అక్కడ వివరిస్తారు సీఎం చంద్రబాబు. ఏఐ కంపెనీలు ఏపీకి వస్తున్న వేళ వాటిని చూసి మరిన్ని కంపెనీలు వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అందుకే సీఎం చంద్రబాబు ముందుగా గూగుల్ డేటా సెంటర్ ను ఏపీకి తీసుకురావడం కోసం అన్ని ప్రయత్నాలు చేశారు. అతిపెద్ద సంస్థ వచ్చాక మిగతా కంపెనీలు ఆటోమేటిక్ గా వస్తాయనేది చంద్రబాబుకు తెలుసు. ఆ విషయం వైసీపీ బ్యాచ్ కు తెలియక పిచ్చి ప్రచారాలు అన్నీ చేస్తోంది. అటు నారా లోకేష్ ఆస్ట్రేలియాలో, ఇటు సీఎం చంద్రబాబు దుబాయ్ పర్యటనలో తెగ బిజీగా కంపెనీలతో మీటింగులు పెడుతున్నారు. ఆ ఫలితాలు రేపు సీఐఐ సమ్మిట్ లో కనిపించబోతున్నాయి.