ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లండన్ చేరుకున్నారు. శుక్రవారం రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి లండన్ పర్యటనకు బయల్దేరిన సీఎం జగన్.. శనివారం అక్కడకు చేరుకున్నారు.
సీఎం జగన్ లండన్‌లో అడుగుపెట్టిన సందర్భంలో అక్కడ ఆయన అభిమానులు ఘన స్వాగతం పలికారు. సీఎం జగన్ విమానం దిగుతున్న క్రమంలో జై జగన్ అంటూ నినాదాలు చేశారు.
అనంతరం సీఎం జగన్‌తో సెల్ఫీలు దిగేందుకు పోటీపడ్డారు. ఒక్కసారి షేక్ హ్యాండ్ అన్నా.. ఒక్క సెల్ఫీ అన్నా అంటూ పలువురు పోటీ పడటం వీడియోల్లో కనిపించింది. ఈ నెల 31వ తేదీ రాత్రి సీఎం జగన్ రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉంది.