పదవుల బేరం కోసమే జగన్ ఢిల్లీ వెళ్లారేమో? : టీడీపీ

ఏపీ ముఖ్యమంత్రి జగన్ వరుస హస్తిన పర్యటనలు పొలిటికల్ సర్కిల్లో ఆసక్తిని రేపుతున్నాయి. ఇవాళ ఉదయం 10 గంటల 40నిమిషాలకి ప్రధాని మోదీతో జగన్‌ భేటీ కానున్నారు..

Update: 2020-10-06 01:28 GMT

ఏపీ ముఖ్యమంత్రి జగన్ వరుస హస్తిన పర్యటనలు పొలిటికల్ సర్కిల్లో ఆసక్తిని రేపుతున్నాయి. ఇవాళ ఉదయం 10 గంటల 40నిమిషాలకి ప్రధాని మోదీతో జగన్‌ భేటీ కానున్నారు. ఈ సమావేశం అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు అపెక్స్‌ కౌన్సిల్‌ వీడియో సమావేశంలో పాల్గొంటారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా జగన్ పలువురు కేంద్రమంత్రులనూ కలవనున్నట్లు సమాచారం. ఏపీలో జరిగిన తాజా రాజకీయ పరిణామాలు, రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ప్రధాని మోదీతో పాటు కేంద్రమంత్రులతో చర్చించనున్నట్లు తెలుస్తోంది.

అమరావతి భూములపై సీబీఐ విచారణ, మూడు రాజధానుల వ్యవహారం, పోలవరం నిధులపై ప్రధానితో జరిగే భేటీలో జగన్ చర్చించనున్నారని సమాచారం. ఇప్పటికే పలు విషయాల్లో సీబీఐ విచారణకై గత ఢిల్లీ పర్యటనలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో చర్చించారని, కానీ అందుకు ఆయన ఒప్పుకోలేదని అప్పట్లో వార్తలు వచ్చాయి. ప్రధానితో జరగనున్న భేటీలో కూడా ఆ విషయాలన్నీ చర్చకొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకూ జగన్ పలుమార్లు ఢిల్లీ పర్యటన వెళ్లారు కానీ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ పర్యటన అజెండాపై కూడా ఎలాంటి సమాచారం ఇవ్వలేదు..

జగన్ ఢిల్లీ పర్యటనపై టీడీపీ వ్యంగ్యాస్త్రాలు సంధించింది. కేంద్ర మంత్రి వర్గంలో పదవుల బేరం కోసమే జగన్ ఢిల్లీ వెళ్లారేమో? అని విమర్శించారు. 25 మంది ఎంపీలను ఇస్తే కేంద్రం మెడలు వంచి హోదా సాధిస్తామని చెప్పిన ప్రగల్భాలు ఎమయ్యాయని నిలదీస్తున్నారు. ఢిల్లీ వెళ్లి వ్యక్తిగత పనులు, కేసులు గురించే జగన్ చర్చిస్తారని అందుకే వివరాలు వెల్లడించే ధైర్యం ఆయనకు లేదని ఆరోపించారు.

Tags:    

Similar News