AP PRC : కాసేపట్లో పీఆర్సీపై ఉన్నతాధికారులతో సీఎం జగన్ సమావేశం..!
AP PRC : ఏపీలో పీఆర్సీపై పీటముడి వీడటం లేదు. కాసేపట్లో ఉన్నతాధికారులతో సీఎం జగన్ సమావేశం నిర్వహించనున్నారు.;
AP PRC : ఏపీలో పీఆర్సీపై పీటముడి వీడటం లేదు. కాసేపట్లో ఉన్నతాధికారులతో సీఎం జగన్ సమావేశం నిర్వహించనున్నారు. పీఆర్సీపై చర్చించనున్నారు. నిన్న పీఆర్సీపై ఉద్యోగుల అభిప్రాయాలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఉద్యోగులు లేవనెత్తిన అంశాలపై ఉన్నతాధికారులతో చర్చించనున్నారు. ఇవాళ రేపట్లో పీఆర్సీపై ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. నిన్న జగన్‌తో నేరుగా చర్చలు జరిపిన ఉద్యోగ సంఘాలకు నిరాశే ఎదురైంది. 55 శాతం ఫిట్‌మెంట్ కోరాయి ఉద్యోగ సంఘాలు. 14.29 శాతం ఫిట్‌మెంట్‌కే మొగ్గుచూపింది ప్రభుత్వం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఉద్యోగులు అర్థం చేసుకోవాలని జగన్ కోరారు. ఉద్యోగ సంఘాలు కోరినట్లు పీఆర్సీ అమలు చేయలేమన్నారు. అయితే.. గత ప్రభుత్వాల్లో ప్రతిపాదించినదానికంటే ఎక్కువ.. తెలంగాణకంటే మెరుగైన పిట్‌మెంట్ ఇవ్వాలని కోరాయి ఉద్యోగ సంఘాలు.