Chandrababu Naidu : ఇండస్ట్రియల్ క్లస్టర్ ఏర్పాటు చేయండి.. ఇజ్రాయెల్ కు చంద్రబాబు ప్రతిపాదన.
సీఎం నారా చంద్రబాబు నాయుడు మూడో రోజు దావోస్ లో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా ఇజ్రాయిల్ దేశ వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి నిర్ బర్కత్, ఆ దేశ ట్రేడ్ కమిషనర్ రోయ్ ఫిషర్ తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. విశాఖ చెన్నై కారిడార్ లో యూఏవి డ్రోన్ తయారీ కంపెనీని ఏర్పాటు చేయాలంటూ సీఎం చంద్రబాబు నాయుడు ప్రతిపాదించారు. అలాగే పారిశుద్ధ్య రంగంలో వ్యర్ధ జలాలను రీసైక్లింగ్ చేసేందుకు టెక్నికల్ సహకారం అందించాలని చంద్రబాబు నాయుడు కోరారు. ఏపీలో క్వాంటం కంప్యూటర్ తో పాటు సెమీ కండక్టర్ల తయారీకి జపాన్, కొరియా లాగా ఇండస్ట్రియల్ క్లస్టర్ ఇజ్రాయిల్ ఏర్పాటు చేయాలని చంద్రబాబు నాయుడు ప్రతిపాదించారు. అమరావతిని కట్టుదిట్టమైన సైబర్ సెక్యూరిటీ నగరంగా మార్చేందుకు ఇజ్రాయిల్ సహకరించాలని కోరారు.
అనంతరం విడియా గ్లోబల్ ఇనిషియేటివ్స్ ఉపాధ్యక్షురాలు కాలిస్టా redmend తో చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. ఏపీలో బిజినెస్ స్టార్టప్స్ ను ఎంకరేజ్ చేయడంతో పాటు యూత్ స్కిల్స్ అండ్ ఎంప్లాయిమెంట్ పెంచేలా సిస్టం ఏర్పాటు చేసేందుకు ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని సూచించారు. దీనికి కాలిస్టా కూడా సానుకూలంగానే స్పందించారు. ఇండియాలో మొట్టమొదటిసారి అమరావతిలోని ఏఐ యూనివర్సిటీ ఏర్పాటు చేసేందుకు కూడా సీఎం చంద్రబాబు నాయుడుతో ఆమె చర్చలు జరిపారు. గ్లోబల్ కేపబిలిటీ సెంటర్, హార్డ్ వేర్ తయారీ యూనిట్, రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటు చేసేందుకు ఎన్విడియా ఆసక్తి చూపించింది.
వీరితో పాటు సీఎం చంద్రబాబు నాయుడు మరింత మంది ఆర్థికవేత్తలతో పాటు ప్రపంచ ప్రఖ్యాత కంపెనీ ప్రతినిధులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ప్రముఖ కంపెనీల సీఈఓ లతో ముఖాముఖి భేటీ అవుతున్నారు. అన్ని రంగాలకు సంబంధించిన కంపెనీల ప్రతినిధులతో సమావేశమై ఏపీలో వారిని పెట్టుబడులు పెట్టేందుకు ఆహ్వానిస్తూ సక్సెస్ అవుతున్నారు నారా చంద్రబాబు నాయుడు.